iDreamPost
android-app
ios-app

Team India: పాండ్యా కాదు.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే..: BCCI మాజీ చీఫ్ సెలెక్టర్

  • Published May 06, 2024 | 4:13 PM Updated Updated May 06, 2024 | 4:13 PM

రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే అంటూ బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఎంఎస్కే ప్రసాద్ చెప్పిన ఆ ప్లేయర్ ఎవరు?

రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే అంటూ బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఎంఎస్కే ప్రసాద్ చెప్పిన ఆ ప్లేయర్ ఎవరు?

Team India: పాండ్యా కాదు.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే..: BCCI మాజీ చీఫ్ సెలెక్టర్

రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరు? గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన విషయం ఇది. టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలను అందించింది బీసీసీఐ. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ ను అన్ని ఫార్మాట్స్ లో అగ్రస్థానంలో నిలిపాడు హిట్ మ్యాన్. అయితే ఐసీసీ ట్రోఫీని అందించడంలో మాత్రం సఫలం కాలేకపోయాడు. టీ20 వరల్డ్ కప్ 2024 మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవ్వబోతున్న నేపథ్యంలో మరోసారి ఈ ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రశ్నకు బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఓ ఆటగాడి పేరును బలంగా సూచించాడు. రోహిత్ తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టే గట్స్ ఉన్న ప్లేయర్ అతడే అంటూ ప్రశంసించాడు.

రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరు? అన్న ప్రశ్నకు ఓ పేరును సూచించాడు బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్. హార్దిక్ పాండ్యా కాదు.. మరే ఇతర ప్లేయర్లు కాదు.. రోహిత్ తర్వాత టీమిండియా పగ్గాలు అందుకునే దమ్ము, ధైర్యం అతడికే ఉందంటూ యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. “టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కరెక్ట్ పర్సన్. గత కొంత కాలంగా అతడు ఒక్కో మెట్టు ఎక్కుతూ.. వస్తున్నాడు. అతడు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలా కాదు. గత రెండు సంవత్సరాల్లో అతడు సాధించిన ఘణంకాలు చూస్తేనే అర్ధమవుతుంది అయ్యర్ ఎలాంటి ఆటగాడో. పైగా ఇండియా-ఏ టీమ్ ఆడిన 10 సిరీస్ ల్లో ఎనిమిది గెలిచింది. అందులో చాలా వాటిని అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అదీకాక ప్రస్తుతం ఐపీఎల్ లో కేకేఆర్ టీమ్ ముందుండి అద్భుతంగా నడిపిస్తున్నాడు. టీమిండియాకు కెప్టెన్ గా అతడు వందకు వందశాతం కరెక్ట్ అని నా అభిప్రాయం” అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే అతడు రిషబ్ పంత్ తో తలపడుతున్నాడని, నిజానికి అయ్యర్ కెప్టెన్ రేసులో పంత్ కంటే ఒక్క అడుగు ముందే ఉన్నాడని మాజీ చీఫ్ పేర్కొన్నాడు. అయితే బీసీసీఐ ఇటీవలే అయ్యర్ పై కొరాఢాఝుళిపించడంతో.. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించబడ్డ విషయం తెలిసిందే. ఇలాంటి ప్లేయర్ కు టీమిండియా పగ్గాలను బీసీసీఐ అప్పగిస్తుందా? అంటే కాదనే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా.. కెప్టెన్ గా నియమించే గుణాలు మాత్రం అయ్యర్ లో పుష్కలంగా కనిపిస్తున్నాయని, రోహిత్ తర్వాత అతడిని కెప్టెన్ చేసినా ఆశ్చర్యం లేదని క్రీడాపండితులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి మీ దృష్టిలో రోహిత్ తర్వాత ఎవరు కెప్టెన్ అవుతారని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.