iDreamPost

బంపరాఫర్: రూ.6.5 కోట్ల ఇల్లు రూ.100కే.. ఎక్కడో తెలుసా?

బంపరాఫర్: రూ.6.5 కోట్ల ఇల్లు రూ.100కే.. ఎక్కడో తెలుసా?

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికీ ఉండే కోరిక. దానిని నిరవేర్చుకునేందుకు రేయింబవళ్లు కష్టపడుతుంటారు. కొందరు తమ కలను సాకారం చేసుకుంటారు. మరికొందరు మాత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా సొంత ఇంటి కలను నిరవేర్చుకో లేకపోతుంటారు. అయితే తక్కువ ధరకు వస్తుందంటే ఇంటిని కొనడానికి ఎగబడే వారు చాలా మంది ఉంటారు. ఇలాంటి సమయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 6.5కోట్ల విలువ చేసే ఇళ్లు రూ.100 కే ఇస్తున్నారంట. అదేంటి అంత ఖరీదైన ఇల్లును అంత తక్కువ ధరకు ఇస్తారా. ఇదంతా ఫేక్ అని అనుకుంటున్నారా. అలా అనుకుంటే మాత్రం పొరపాటే.  నిజంగానే రూ.100కే ఇళ్లు ఇస్తున్నారు. అయితే అందుకు కొన్ని అర్హతలు ఉండాలని సూచిస్తున్నారు. అసలు ఈ రూ.100కే ఇళ్లు స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రిటన్ లోని లూయి సిటీలోని కార్నిష్ టౌన్ సెంటర్ లో నివసించే వారికి  రూ.100కే ఇళ్లు లభిస్తున్నాయి.  6,40,000 పౌండ్లు అంటే  భారత కరెన్సీలో రూ.6.6 కోట్ల విలువైన గ్రేడ్ -2 లిస్టెడ్ ఫ్లాట్ ను కేవలం ఒక పౌండ్ అంటే మన కరెన్సీలో కేవలం రూ.103 కే అందించేందుకు సిద్ధమయ్యారు.  ఈ ఇళ్ల విక్రయానికి స్థానిక కౌన్సిల్ అంగీకారం తెలిపింది. అయితే ఈ ఫ్లాట్‌లను బహిరంగ మార్కెట్‌లో విక్రయించడం లేదని డిప్యూటీ కౌన్సిల్ లీడర్ డేవిడ్ హారిస్ తెలిపారు. ఇప్పటికే లూయి నగరంలో సెకండ్ హ్యాండ్ ఇళ్లు, హాలిడే స్పాట్‌లు అధికంగా ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో ఇళ్లు తక్కువ ధరకు దొరకడం చాలా కష్టమని  వారు వెల్లడించారు.

ఈ క్రమంలోనే సామాన్యులు, పేదలు ఇళ్లు కొనుక్కునే  అవకాశం లేకుండా పోయిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కమ్యూనిటీ హౌస్‌ డెవలప్‌మెంట్ స్కీమ్ కింద ఈ ఇళ్లను కేవలం పేదలకు మాత్రమే అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. 2021లో లూయి కౌన్సిల్ చేపట్టిన నార్త్ రోడ్ భవనం పునర్నిర్మాణం బాగా ఖర్చుతో కూడుకుందని తెలిపారు. అలాంటి అధిక నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ ప్రాంతంలోని గ్రేడ్-2 ఫ్లాట్లను విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.

లూయి కౌన్సిలర్లు ఎడ్వినా హన్నాఫోర్డ్, అర్మాండ్ టామ్స్ మద్దతు ఇవ్వడంతో త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్ అనే సంస్థ రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఖర్చుతో ఈ ఇళ్లను కట్టేందుకు ముందుకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఇళ్లను పొందే వారికి కొన్ని అర్హతలు ఉండాలని అధికారులు సూచించారు. ఇళ్లను పొందేవారు కనీసం ఐదేళ పాటు ఉండాలి. లబ్ధిదారులు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉండాలి. అలానే వారి కుటుంబ ఆదాయం 18 వేల పౌండ్ల నుంచి 25 వేల పౌండ్ల మధ్య మాత్రమే ఉండాలి. మరి.. ఇలా రూ.6.5 కోట్ల విలువైన ఇళ్లను రూ.100కే ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి