iDreamPost

గర్భిణీలకు ఆర్థిక సాయం అందిస్తున్న కేంద్రం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

కేంద్ర ప్రభుత్వం గర్భీణీలకు శుభవార్తను అందించింది. వారి కోసం ఓ వినూత్నమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ పథకానికి ఎవరు అర్హతలు ఏంటంటే?

కేంద్ర ప్రభుత్వం గర్భీణీలకు శుభవార్తను అందించింది. వారి కోసం ఓ వినూత్నమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ పథకానికి ఎవరు అర్హతలు ఏంటంటే?

గర్భిణీలకు ఆర్థిక సాయం అందిస్తున్న కేంద్రం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు వినూత్నమైన పథకాలను ప్రవేశ పెడుతున్నాయి. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళల కోసం వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు పథకాలను తీసుకొస్తున్నాయి ప్రభుత్వాలు. పోస్టాఫీస్ స్కీమ్స్, అధిక రాబడి ఇచ్చే ఇతర పెట్టుబడి పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. కాగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం గర్భిణీలకు ఆర్థిక సాయం అందించేందుకు ఓ స్కీమ్ ను ప్రవేశ పెట్టింది. ఆ పథకమే ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన. ఈ పథకం ద్వారా మొత్తం 11 వేలు అందించనుంది. అయితే ఈ పథకాల గురించి చాల మందికి తెలియక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే?

గర్భం దాల్చింది మొదలు డెలివరీ అయ్యేంత వరకు బోలెడన్నీ డబ్బులు ఖర్చు అవుతుంటాయి. పేద మహిళలకు ఇది మరింత భారంగా ఉంటుంది. ఇలాంటి వారికి ఊరటనిచ్చేలా కేంద్రం ఈ ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా తొలి కాన్పుకు 5 వేలు, రెండవ కాన్పుకు 6 వేలు చొప్పున అందిస్తున్నది. ఇందుకోసం గర్బం దాల్చిన వెంటనే మహిళలు తమ పరిధిలోని ఆశా వర్కర్‌/ఏఎన్‌ఎం ద్వారా ఈ స్కీమ్‌కు సంబంధించిన పోర్టల్‌లో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. డబ్బులు నేరుగా లబ్ధిదారు అకౌంట్‌లో జమ అవుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడ ప్రసవం జరిగినా ఈ సహాయాన్ని అందించనుంది ప్రభుత్వం.

ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పథకానికి అర్హులు:

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల స్త్రీలు. 40 శాతం వైకల్యం లేదా పూర్తి వైకల్యం ఉన్న మహిళలు. బీపీఎల్ రేషన్ కార్డు ఉన్న మహిళలు. ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన మహిళా లబ్దిదారులు. ఉపాధిహామీ పథకం కార్డు(జాబ్ కార్డు) ఉన్నవారు. గర్బిణీ అంగన్ వాడీ వర్కర్లు, అంగన్ వాడీ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు. ఈ- లేబర్ కార్డు ఉన్న స్త్రీలు, వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉన్నవారు అర్హులు. గర్భం దాల్చిన మహిళ వయసు 18 ఏళ్లు దాటాలి.

దరఖాస్తు ఎలా అంటే?

గర్భిణీ మహిళలు అంగన్ వాడీ సేవిక, ఆరోగ్య కేంద్రాల ద్వారా శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ ఆఫీస్ కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఆశా కార్యకర్తను గానీ, ఏఎన్‌ఎంగానీ సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో కూడా నిర్వహిస్తారు. https://pmmvy.nic.in వెబ్ సైట్ ను సందర్శించి ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి