iDreamPost

బిడ్డ ప్రాణాల కోసం తల్లి కన్నీరు! ఆదుకున్నCM జగన్!

బిడ్డ ప్రాణాల కోసం తల్లి కన్నీరు! ఆదుకున్నCM జగన్!

నాయకుడికి నిలువెత్తు నిదర్శనం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.  ప్రజలకు, కార్యకర్తలకు నమ్మకం, భరోసా కల్పించడంలో సీఎం జగన్ ముందుంటారు.  ఊపిరి సలపని క్షణాల్లోనూ ముఖంపై చెక్కు చెదరని చిరునవ్వు ఆయన సొంతం. ఇక ఎలాంటి పరిస్థితి అయినా కష్టం వింటే చలించి.. నేనున్నానంటూ చేయూతనివ్వడం ఆయన వ్యక్తిత్వం. అందుకే నిరుపేదలు ఆయనను తమను బాధల నుంచి గట్టెక్కించే దేవుడిగా విశ్వసిస్తారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే కష్టమంటూ ఆర్థిక సాయం కోసం వచ్చిన ఎంతోమందిని మానవత్వంతో సీఎం జగన్ ఆదుకున్నారు. తాజాగా సామర్ల కోట సభా వేదికగా మరోసారి సీఎం జగన్ మంచి మనస్సు చాటుకున్నారు.

గురువారం సామర్లకోటలో జగనన్న కాలనీల్లో సామూహిక గృహ ప్రవేశాలకు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనను హెలిప్యాడ్ వద్ద కలుసుకున్నారు. తమ ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి గురించి చెప్పి గోడు వెళ్లబోసుకున్నారు.  అంత బిజీ షెడ్యూల్  లోనూ.. కష్టం అని తన వద్దకు వచ్చిన వారి సమస్యలను సావధానంగా విన్నారు. వారి అనారోగ్య సమస్యలపై తక్షణమే స్పందించాలని కాకినాడ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఫలితంగా 24 గంటల్లోనే  వివిధ ప్రాంతాలకు చెందిన 17 మందికి ఆర్థిక సాయం అందింది. సీఎం సహాయ నిధి నుంచి శుక్రవారం సాయంత్ర బాధితులకు రూ. లక్ష చొప్పున వారికి ఆర్థిక సహాయం అందజేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా సంతోషం వ్యక్తమవుతుంది. వినతి ఇచ్చిన గంట వ్యవధిలోనే ఇలా స్పందించి ఆదుకుంటారని తాము భావించలేదంటూ బాధితులు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

కోనసీమ జిల్లాకు చెందిన సీహెచ్ దుర్గాభవాని కుమార్తె హర్షిత(15) థ్రాంబోకైటోపినియాతో బాధ పడుతోంది. తన బిడ్డ ఆనారోగ్యం గురించి తలచుకుని ఆమె నిత్యం వేదన చెందేది.  ఈ క్రమంలోనే  సీఎం జగన్ తో తన బాధ గురించి చెప్పుకోవడంతో.. ఒక్క రోజు వ్యవధిలోనే ఆర్థికసాయం అందింది. అలానే ఎన్. సతీష్ అనే వికలాంగుడికి, మీనింగోమా వ్యాధితో బాధ పడుతోన్న సుజాత అనే మహిళ, కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న సుబ్రహ్మణ్యానికి  సీఎం జగన్ సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందింది. ఇలానే మొత్తం 17 మందికి 24 గంటల వ్యవధిలోనే  కలెక్టర్ చేతుల మీదుకు ఆర్థిక సాయం అందజేశారు. దీంతో బాధితులు సీఎం జగన్ కి,  కాకినాడ జిల్లా కలెక్టర్ కి  కృతజ్ఞతలు తెలిపారు. మరి.. మంచి మనస్సు చాటుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి