iDreamPost

ఏపీ రైతులకు శుభవార్త.. ఆ స్కీమ్ లో అర్హుల నమోదుకు గడువు పెంపు!

  • Author Soma Sekhar Published - 11:21 AM, Sat - 14 October 23
  • Author Soma Sekhar Published - 11:21 AM, Sat - 14 October 23
ఏపీ రైతులకు శుభవార్త.. ఆ స్కీమ్ లో అర్హుల నమోదుకు గడువు పెంపు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది. తాజాగా ఏపీలోని రైతులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ప్రతి ఏడాది నేరుగా వారి అకౌంట్లోకి రూ. 13,500 పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులను ఈ పథకంలో చేరేందుకు గడువు ఇచ్చింది. ఈ గడువును మరోసారి పెంచింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు.

ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులు నమోదు చేసుకోవడానికి మరోసారి గడువును పెంచింది. ఈనెల 15వ తేదీ వరకు ఈ పథకాలకు అర్హులైన వారు నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ తెలిపారు. నూతనంగా రైతు యజమాని హక్కు పత్రాలు వచ్చినవారు రైతు భరోసా పోర్టల్ లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. కాగా.. రైతు భరోసాకు అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దేవాదాయ భూముల కౌలుదారులు, అటవీ హక్కుదారులు ఆధార్, సీసీఆర్సీ, హక్కు పత్రాలను ఆర్బీకేల్లో వీహెచ్ఏలను సంప్రదించాలని సూచించారు. ఇక వచ్చే నెల మెుదటి వారంలోనే రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పేర్లు నమోదు చేసుకోని వారు వెంటనే వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి