iDreamPost
android-app
ios-app

ఆస్తి కోసం అంత్యక్రియలు నిలిపివేత! నంద్యాలలో దారుణ ఘటన

  • Published Aug 27, 2023 | 12:28 PM Updated Updated Dec 15, 2023 | 6:24 PM

తండ్రి చనిపోయాడనే బాధ కంటే.. ఆస్తి పంచకుండా వెళ్లిపోయాడనే బాధపడే పిల్లలు ప్రస్తుత సమాజంలో ఎక్కువైపోతున్నారు. కని పెంచిన తండ్రి రేపటి నుంచి మన కళ్ల ముందు ఉండడనే విషయాన్ని చాలా తేలిగ్గా జీర్ణించుకుని..

తండ్రి చనిపోయాడనే బాధ కంటే.. ఆస్తి పంచకుండా వెళ్లిపోయాడనే బాధపడే పిల్లలు ప్రస్తుత సమాజంలో ఎక్కువైపోతున్నారు. కని పెంచిన తండ్రి రేపటి నుంచి మన కళ్ల ముందు ఉండడనే విషయాన్ని చాలా తేలిగ్గా జీర్ణించుకుని..

  • Published Aug 27, 2023 | 12:28 PMUpdated Dec 15, 2023 | 6:24 PM
ఆస్తి కోసం అంత్యక్రియలు నిలిపివేత! నంద్యాలలో దారుణ ఘటన

రానురాను మానవ సంబంధాలు మరింత పలుచబారుతున్నాయి. కేవలం ఆస్తి కోసమే బంధాలను గుర్తుచేసుకుంటున్న రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. తండ్రి చనిపోయాడనే బాధ కంటే.. ఆస్తి పంచకుండా వెళ్లిపోయాడనే బాధపడే పిల్లలు ప్రస్తుత సమాజంలో ఎక్కువైపోతున్నారు. కని పెంచిన తండ్రి రేపటి నుంచి మన కళ్ల ముందు ఉండడనే విషయాన్ని చాలా తేలిగ్గా జీర్ణించుకుని.. ఆయన రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన ఆస్తి ఎక్కడ తమకు దక్కకుండా పోతుందో అనే ఆవేదనతో రెండు రోజులుగా తండ్రి అంత్యక్రియలు చేయకుండా మృతదేహాన్ని ఇంటి ముందే ఉంచుకుని పిల్లలు పంచాయితీకి ఎక్కిన వింత ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

నంద్యాలకు చెందిన చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వెంకటసుబ్బమ్మను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల తర్వాత ఆయన బుజ్జమ్మను అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. రెండో భార్య మరణించడంతో వెంకటేశ్వర్లు లక్ష్మీదేవిని మూడో వివాహం చేసుకున్నారు. ఈమెకు కూడా ఇద్దరు సంతానం కలిగారు. చాలా కాలంగా వెంకటేశ్వర్లు మూడో భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు శనివారం మృతి చెందారు.

వెంకటేశ్వర్లు మరణ వార్త తెలియగా.. మొదటి భార్య, పిల్లలు, రెండో భార్య పిల్లలంతా అక్కడికి చేరుకున్నారు. అయితే.. తండ్రి ఆస్తిలో తమ భాగం తమకు ఇవ్వాలని అప్పటి వరకు అంత్యక్రియలు చేయడానికి వీల్లేదని అడ్డుకున్నారు. మూడో భార్య మాత్రం ఆయన పేరిట ఆస్తి ఏం లేదని, ఉన్న ఈ ఇంట్లో తాము ఉంటున్నట్లు చెప్పినా.. వాళ్లు వినలేదు. దీంతో ఈ వ్యవహారం ఏకంగా పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లింది. దీంతో రెండు రోజులుగా వెంకటేవ్వర్లు మృతదేహం రోడ్డుపైనే ఉండిపోయింది. పంచాయితీ తేలితే కానీ, ఆయన అంత్యక్రియలు జరిగేలా లేవు. మరి ఈ ఘటనపైమ ఈ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అర్దనగ్నంగా యువతి హల్ చల్