iDreamPost
android-app
ios-app

తండ్రీ కూతుళ్లు చేసిన ఆ ఒక్క ఆలోచన.. కోటీశ్వరులను చేసింది

వ్యాపారం చేయాలంటే పెట్టుబడే పెట్టాల్సిన పనిలేదు అంటున్నారు ఆ తండ్రీ కూతుర్లు. వారు చేసిన వినూత్న ఆలోచన నేడు కోట్లు కురిపిస్తోంది. ఇంతకీ వారు చేసే వ్యాపారం ఏంటంటే?

వ్యాపారం చేయాలంటే పెట్టుబడే పెట్టాల్సిన పనిలేదు అంటున్నారు ఆ తండ్రీ కూతుర్లు. వారు చేసిన వినూత్న ఆలోచన నేడు కోట్లు కురిపిస్తోంది. ఇంతకీ వారు చేసే వ్యాపారం ఏంటంటే?

తండ్రీ కూతుళ్లు చేసిన ఆ ఒక్క ఆలోచన.. కోటీశ్వరులను చేసింది

బిజినెస్ చేయాలంటే అంత ఈజీ కాదు. దానికి ఎంతో కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒక వేళ నష్టం వచ్చినా భరించేందుకు సిద్ధంగా ఉండాలి. అయితే వ్యాపారం చేయడానికి అనేక మార్గాలున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం, పాల వ్యాపారం, హోటల్, పేపర్ ప్లేట్స్, ఇలా రకరకాల బిజినెస్ లు చేయొచ్చు. అయితే కొన్ని వ్యాపారాలకు ఆలోచనే పెట్టుబడిగా మారుతుంది. పనికిరాని వ్యర్థాలతో కూడా లక్షలు, కోట్లు సంపాదించొచ్చని ఇటీవల పలువురు నిరూపిస్తున్నారు. ఇదే రీతిలో ఓ తండ్రీ కూతుర్లు వినూత్నమైన ఆలోచన చేశారు. అసలు పైసా ఖర్చు లేకుండా వ్యాపారంలో రాణిస్తున్నారు. వారు ఆవుపేడతో అద్భుతం చేశారు. ఆవు పేడతో వీరు చేసిన ఉత్పత్తులు కాసుల వర్షం కురిపిస్తోంది.

ఆవు పేడ వ్యవసాయ భూముల్లో సారం పెంచేందుకు ఉపయోగిస్తారు. అదేవిధంగా పల్లెటూర్లలో కల్లాపి చల్లుకునేందుకు వినియోగిస్తారు. అంతే తప్పా పేడతో కోట్లు సంపాదించొచ్చని ఎవరూ ఆలోచించి ఉండరు. కానీ రాజస్థాన్ కు చెందిన ఓ తండ్రీ కూతుర్లు మాత్రం ఆవుపేడనే పెట్టుబడిగా మలుచుకున్నారు. వీరు ఆవుపేడతో చేసే ఉత్పత్తులను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆవు పేడతో పెళ్లి కార్డులు, ఎన్వలప్‌లు, రాఖీలు, డైరీలతో సహా 100 రకాల ఉత్పత్తులను తండ్రీకూతుళ్లిద్దరూ తయారు చేశారు. వారు మరెవరో కాదు భీమ్‌రాజ్ శర్మ అతని కూతురు జాగృతి శర్మ. అయితే మొదట్లో ఆవుపేడతో ఉత్పత్తులను చేస్తున్నప్పుడు అంతా తమను పిచ్చోళ్లలా భావించేవారని ఆయన వెల్లడించారు.

Father and daughter earning crores without investment

ఆవుపేడతో చేసిన రాఖీలను ప్రధాని మోడికి పంపుతున్నానని తెలిపాడు. ప్రధానితో పాటు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కూడా పంపిస్తునట్లు భీమ్‌రాజ్ వెల్లడించాడు. ప్రస్తుతం తన బిజినెస్ ద్వారా 20 మందికి ఉపాధి కల్పించామని తెలిపాడు. తమ కంపెనీ వార్షిక టర్నోవర్ 1.5 కోట్లని ఆయన వివరించారు. ఆవు పేడతో పేపర్, డైరీలు, పుస్తకాలు, క్యాలెండర్లు, గ్రీటింగ్ కార్డ్‌లు, మాస్క్‌లు, రాఖీ వంటి వాటిని తయారు చేస్తారు. ఈ ఉత్పత్తులు పర్యావరణహితంగా ఉండడంతో ఆదరణ పెరిగింది. దీంతో వారికి లాభాల పంట కురిసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి