• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » news » Farmers Protest Chakka Jam Program Today

రైతన్న పోరుబాట.. కాసేపట్లో చక్కా జామ్‌

  • By Idream media Published Date - 06:19 AM, Sat - 6 February 21 IST
రైతన్న పోరుబాట..  కాసేపట్లో  చక్కా జామ్‌

నూతన సాగు చట్టాలను రద్దు చేయడం, పంటల కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్లతో రైతులు చేస్తున్న ఉద్యమం గణతంత్ర దినోత్సవం తర్వాత మరో దశకు చేరిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఢిల్లీ సరిహద్దుల్లో భైటాయించిన రైతులు శాంతియుతంగా నిరసన తెలపగా.. ఇప్పుడు ప్రత్యక్ష పోరు సాగిస్తున్నారు. వివిధ మార్గాల్లో తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. మహా పంచాయత్‌లు, ఖాఫ్‌ పంచాయత్‌లు నిర్వహిస్తున్న రైతు సంఘాల నేతలు, భారతీయ కిసాన్‌ యూనియన్‌నేత రాకేష్‌ టికాయత్‌ నేతృత్వంలో ఉద్యమం సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు చక్కా జామ్‌ పేరుతో జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్భందించాలని నిర్ణయించారు.

ఈ రోజు శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు చక్కా జామ్‌ కార్యక్రమం జరగబోతోంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా రైతు సంఘాల నేతలు, రైతులు జాతీయ, రాష్ట్ర రహదారులపై నిరసన వ్యక్తం చేయనున్నారు. పాఠశాలలు, అంబులెన్స్‌లు ఇతర అత్యవసర వాహనాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. మూడు గంటల పాటు వాహనాలను ఎక్కడికక్కడ నిలిపి తమకు మద్ధతు తెలపాలని రైతు సంఘాలు వాహనదారులను కోరాయి. మధ్యాహ్నం మూడు గంటలకు కార్యక్రమం ముగిసేందుకు ఒక్క నిమిషం ముందు వాహనాల హారన్లు మోగించి తమ ఉద్యమానికి సంఘీభావం తెలపాలని రైతు సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

చక్కా జామ్‌ కార్యక్రమం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం.. అలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతోంది. ఆందోళనకారులు ఢిల్లీలోకి రాకుండా రహదారులపై బారికేడ్లు, కాంక్రీటు గోడలు, రోడ్లకు మేకులు కొట్టించింది. భారీ సంఖ్యలో పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరించింది. చక్కా జామ్‌ కార్యక్రమంలో ఢిల్లీ నగరంలో జరగకపోయినా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెట్రో స్టేషన్లను మూసివేశారు. బందోబస్తును పటిష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వంలో పలుమార్లు చర్చలు జరిగినా.. ఎలాంటి ఫలితం లేకపోవడంతో.. ఇకపై చర్చలు జరిపేది లేదని, సాగు చట్టాల రద్ధు, కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండు డిమాండ్లతోపాటు స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, పంట రుణాలను రద్దు చేయాలనే నూతన డిమాండ్లను భారతీయ కిసాన్‌ యూనియన్‌నేత రాకేష్‌ టికాయత్‌ తెరపైకి తెచ్చారు. డిమాండ్ల సాధన కోసం వివిధ మార్గాల్లో నిరసన కార్యక్రమం కొనసాగించాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించినట్లు తాజాగా జరుగుతున్న పరిణామాల ద్వారా స్పష్టమవుతోంది. తమ డిమాండ్లు అమలు చేయకపోతే.. గద్దె దింపాల్సి వస్తుందని కూడా రాకేష్‌ టికాయత్‌ పరోక్షంగా హెచ్చరించడం విశేషం. ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని, త్వరలో 40 లక్షల ట్రాక్టర్లతో దేశ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహిస్తామని కూడా రాకేష్‌ టికాయత్‌ హెచ్చరించారు. తాజా పరిణామాలను కేంద్ర ప్రభుత్వం సునిశితంగా పరిశీలిస్తోంది.

Tags  

  • Chakka Jam Program
  • Farmers Protest
  • New Agri Acts

Related News

అదే జరిగితే.. ఆ చట్టాలు మళ్లీ వస్తాయా..?

అదే జరిగితే.. ఆ చట్టాలు మళ్లీ వస్తాయా..?

ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు బీజేపీ వ్యతిరేక పార్టీలకు నిరాశను కలిగించాయి. ఉత్తరప్రదేశ్‌తోపాటు, ఉత్తరాఖండ్, మణిపూర్‌ రాష్ట్రాలలో మళ్లీ బీజేపీనే అధికారం వరించబోతోందని దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. పంజాబ్‌లో ఆప్, గోవాలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని పేర్కొన్నాయి. పంజాబ్‌లో బీజేపీ బలంగా లేదు. ఆ రాష్ట్రంలపై కమలం పార్టీ ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. ఐదు రాష్ట్రాలలో అతి ముఖ్యమైన ఉత్తరప్రదేశ్‌పైనే బీజేపీ నేతలు ఎక్కువగా ఫోకస్‌ చేశారు. […]

2 years ago
ఆరు నెలల రైతు ఉద్యమం, రాబోయే ఎన్నికలపై బీజేపీలో మొదలయిన చర్చ

ఆరు నెలల రైతు ఉద్యమం, రాబోయే ఎన్నికలపై బీజేపీలో మొదలయిన చర్చ

2 years ago
కదం తొక్కుతున్న అన్నదాత

కదం తొక్కుతున్న అన్నదాత

2 years ago
రెండు నాలుగయ్యాయి.. అసలుకే ఎసరొచ్చేలా ఉంది..!

రెండు నాలుగయ్యాయి.. అసలుకే ఎసరొచ్చేలా ఉంది..!

3 years ago
వద్దాన్నా వినరేమి..?

వద్దాన్నా వినరేమి..?

3 years ago

తాజా వార్తలు

  • 9 ఏళ్లు ఆయనతో ప్రేమలో ఉన్నా.. కానీ ఆ విషయం లగ్నపత్రికతోనే తెలిసింది!
    2 hours ago
  • రైతులకు అలర్ట్.. ఆ పని చేయకపోతే నష్టపోతారు!
    2 hours ago
  • సమంత గ్రేట్‌.. ఇలా నిజం ఒప్పుకునే ధైర్యం ఎవరికి ఉంది?
    2 hours ago
  • డాక్టర్‌ నిర్వాకం.. కడుపులో కత్తి వదిలేశాడు..
    3 hours ago
  • ఆస్కార్ రేసులో ‘బలగం’, ‘దసరా’.. ఆ సినిమాతోనే తెలుగు మూవీస్​కు పోటీ!
    3 hours ago
  • విద్యార్థితో గుంజీలు తీయించాడని.. టీచర్ పై పేరెంట్ దాడి.. వీడియో వైరల్
    3 hours ago
  • కూతురి మరణం.. విజయ్‌ ఆంటోనీ ఎమోషనల్‌ లేఖ!
    3 hours ago

సంఘటనలు వార్తలు

  • ‘సలార్’ గురించి ఇక మర్చిపోండి.. ప్రభాస్ మూవీ ఇప్పట్లో లేనట్లే!
    4 hours ago
  • గుడ్ న్యూస్ చెప్పిన TSRTC.. ప్రయాణికులకు బంపరాఫర్!
    4 hours ago
  • 7/G రీ రిలీజ్! 20 ఏళ్ళ తరువాత కూడా ఇంత క్రేజ్ కి కారణం?
    4 hours ago
  • వీడియో: చాయ్ కోసం వెళ్లిన పోలీసులు.. వ్యాన్ నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీలు
    5 hours ago
  • టీమిండియాలో అతడే నెక్స్ట్ కోహ్లీ.. వరల్డ్ కప్​లో దంచికొడతాడు: రైనా
    5 hours ago
  • ప్రజలపై రెచ్చిపోయిన సీఎం కుమారుడు.. డబ్బు పిచ్చి పట్టిందంటూ..
    5 hours ago
  • సూర్యపై మాకు నమ్మకం ఉంది! అతన్ని ఇంకా సపోర్ట్‌ ఇస్తాం: ద్రవిడ్‌
    5 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version