iDreamPost

తండ్రి కష్టం చూడలేక.. కాడెద్దులుగా మారిన యువకులు!

తండ్రి కష్టం చూడలేక.. కాడెద్దులుగా మారిన యువకులు!

నిత్యం ఎందరో పేదరికం కారణంగా నరకం అనుభవిస్తుంటారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ తాము పేదరికం నుంచి బయట పడేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అయితే కేవలం ఆ ఇంటి యజమానే కష్టం చూసి మిగిలిన కుటుంబ సభ్యులు కూడా వ్యవసాయంతో సాయం చేస్తుటారు. అయితే కొన్ని కుటుంబాల కష్టాలు చూస్తే హృదయం చలిస్తుంది. అలాంటి మనస్సు కరిగించే దృశ్యం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. తండ్రి కష్టం చూడలేక డిగ్రీ చదివిన ఇద్దరు యువకులు కాడెద్దులుగా మారి.. అండగా నిలిచారు. మరి… ఆ పేదవారి కథ చిత్రమ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలానికి చెందిన రైతు మహ్మద్ రఫీ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకు ఉన్న రెండెకరాల పొలంలో పత్తి సాగు చేశారు. పంటకు భారీగానే పెట్టుబడులు పెట్టాడు. అలానే పంటలో కలుపు తీసేందుకు పెట్టుబడి ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్నాడు. దీంతో తానొక్కడే నిత్యం పొలంకి వెళ్లి కలుపు తీస్తుండేవారు. తండ్రి కష్టాన్ని డిగ్రీ చదువుతున్న కొడుకులు చూడలేకపోయారు. కలుపు నివారణకు గుంటకను లాగేందుకు కాడెద్దులుగా మారారు. అలా ముగ్గురు కలిసి పంట పొలంలోని కలుపును తీసేశారు.

ఈ సందర్భంగా మహ్మద్ రఫీ మాట్లాడుతూ..” తెగుళ్ల బెడదతో పంట చేతికొస్తోందో లేదోనన్న అనుమానం ఉంది. పంటలో కలుపు నివారణకు ఎద్దుల గెలానికి రూ.1000 చెల్లించడమూ భారంగా మారింది” అని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీ చదువుకున్న యువకులు కాడెద్దులుగా మారి రఫీ వ్యవసాయం చేసే సన్నివేశం చూసిన  స్థానికుల కళ్లలో నీళ్లు తిరిగాయి. కర్నూలు జిల్లాలోని పత్తి పంటలు నెల క్రితం దాకా ఎండలకు ఎర్ర తెగులు బారిన పడి దెబ్బతిన్నాయి.

ఖరీఫ్‌ సీజన్ ప్రారంభమైనా అవసరమైన మేర వర్షాలు పడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పంటల సాగుకు రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే వేసిన పంటల్ని ఎలా రక్షించుకోవాలో తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఓ రైతు నెలల బిడ్డ ఉన్న తన భార్యను పొలానికి తీసుకెళ్లాడు. కాడెద్దుల నాగలికే ఊయల కట్టి.. అందులో పాపను ఉంచాడు. ఆ ఘటన కూడా అందరిని కలచి వేసింది. ప్రస్తుతం యువకుల వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి