iDreamPost
android-app
ios-app

అట్లీ – అల్లు అర్జున్ కాంబో! ఏది తేల్చి చెప్పరేం..?

  • Author ajaykrishna Updated - 02:00 PM, Sat - 23 September 23
  • Author ajaykrishna Updated - 02:00 PM, Sat - 23 September 23
అట్లీ – అల్లు అర్జున్ కాంబో! ఏది తేల్చి చెప్పరేం..?

ఇండస్ట్రీలో కొన్నాళ్ళుగా ఈ కాంబినేషన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. దర్శకుడు అట్లీ, అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు అని. రీసెంట్ గా జవాన్ ప్రమోషన్స్ లో కూడా అట్లీ తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమని చెప్పాడు. దీంతో వీరి కాంబినేషన్ లో సినిమా కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోయి ఊహగానాలు క్రియేట్ చేసుకున్నారు ఫ్యాన్స్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకొని.. పుష్పరాజ్ క్యారెక్టర్ కి నేషనల్ అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్. దీంతో బన్నీ ఏం చేసినా.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఫ్యాన్స్ కి బ్రేకింగ్ గానే అనిపిస్తుంటాయి. ప్రస్తుతం బన్నీ సుకుమార్ తో కలిసి పుష్ప సీక్వెల్ లో వర్క్ చేస్తున్నాడు.

ఇక కింగ్ షారుఖ్ ఖాన్ తో జవాన్ తీసి బ్లాక్ బస్టర్ కొట్టేశాడు అట్లీ. విజిల్ తర్వాత దాదాపు మూడేళ్లు షారుఖ్ కోసం వెయిట్ చేసిన అట్లీ.. ఒక్కసారిగా సినిమాలో తన అభిమానం మొత్తం చూపించేసాడు. షారుఖ్ ని డ్యూయెల్ రోల్ లో మాస్ యాటిట్యూడ్ తో చూపించాడు. ఫస్ట్ డే నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న జవాన్.. వరల్డ్ వైడ్ గా రూ. 900 కోట్లు కలెక్షన్స్ వైపు పరుగులు పెడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా.. వచ్చే ఏడాది ఆగష్టు నెలలో రిలీజ్ కాబోతుందని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇప్పుడు బన్నీ తదుపరి ప్రాజెక్ట్ గురించి చర్చలు మొదలయ్యాయి.

బన్నీ లైనప్ లో ఆల్రెడీ పుష్ప 2 తర్వాత.. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా కన్ఫర్మ్ అయి ఉన్నారు. పైగా వాళ్ళతో బన్నీ కాంబినేషన్ కూడా అధికారికంగా అనౌన్స్ మెంట్ అయ్యింది. అయినా.. ఇప్పటిదాకా కన్ఫర్మ్ అవ్వని అట్లీ కాంబినేషన్ పైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అభిమానులు. కానీ.. అటు అట్లీ వైపు నుండి, ఇటు బన్నీ వైపు నుండి కాంబినేషన్ పై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. పైగా తాజాగా అట్లీని బన్నీ కలిసి చర్చలు కూడా జరపడం జరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సో.. ఈ లెక్కన త్వరలో అనౌన్స్ మెంట్ ఏమైనా ఉంటుందా? లేక ఇంకొన్నాళ్ళు ఆగాలా? అనేసి ఫ్యాన్స్ అంటున్నారు. మరి వీరిద్దరూ ఏదోకటి త్వరగా తేల్చేస్తే ఫ్యాన్స్ కి కూడా మనసు కుదుటపడుతుంది. సో.. అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Girişenbet girişHoliganbet Giriş