iDreamPost
android-app
ios-app

VIDEO: రోహిత్ కు తలనొప్పిగా మారిన కోహ్లీ ఫ్యాన్స్.. అస్సలు వదలట్లేదు!

  • Author Soma Sekhar Published - 08:56 PM, Mon - 6 November 23

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో టెన్షన్ ఎదురౌతోంది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో టెన్షన్ ఎదురౌతోంది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Author Soma Sekhar Published - 08:56 PM, Mon - 6 November 23
VIDEO: రోహిత్ కు తలనొప్పిగా మారిన కోహ్లీ ఫ్యాన్స్.. అస్సలు వదలట్లేదు!

ప్రస్తుత వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ పేరు మారుమ్రోగిపోతోంది. తన అద్భుతమైన బ్యాటింగ్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు విరాట్ భాయ్. అయితే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో టెన్షన్ ఎదురౌతోంది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా జరిగిన సౌతాఫ్రికా మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇంతకు రోహిత్ ను విరాట్ ఫ్యాన్స్ చేస్తున్న టార్చర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోహిత్ శర్మ.. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియాను ముందుండి నడిపిస్తున్న నాయకుడు. తనదైన కెప్టెన్సీలో ప్రపంచ కప్ లో భారత టీమ్ ను విజయవంతంగా సెమీస్ కు చేర్చాడు. ఇంతటి ఘనత వహించిన రోహిత్ కు విరాట్ ఫ్యాన్స్ నుంచి ఊహించని తలనొప్పి ఎదురౌతోంది. తాజాగా వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ ఫ్యాన్స్ చేసిన రచ్చ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే? సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయాలి అంటూ.. ఫ్యాన్స్ చేసిన రచ్చ వైరల్ గా మారింది.

‘విరాట్ కో బౌలింగ్ డు’ అంటూ అభిమానులు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ గెలుస్తుందని తెలిసి.. అభిమానులు కోహ్లీని బౌలింగ్ వేయాలని కోరారు. దానికి విరాట్ చేతులెత్తి నమస్కరించాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. కాగా.. కోహ్లీకి బౌలింగ్ ఇవ్వాలి అన్న ఫ్యాన్స్ డిమాండ్స్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రోహిత్ కు కొత్త తలనొప్పి ఎక్కువైంది. మరి రోహిత్ కు కోహ్లీ ఫ్యాన్స్ టార్చర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş