iDreamPost
android-app
ios-app

లైవ్ మ్యాచ్ లో లేడీ క్రికెటర్ కు పెళ్లి ప్రపోజల్.. రిప్లై ఏంటంటే?

  • Published Feb 28, 2024 | 3:03 PM Updated Updated Feb 28, 2024 | 3:03 PM

మ్యాచ్ జరుగుతుండగానే ఓ లేడీ క్రికెటర్ కు ఫ్యాన్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. ప్లకార్డు పట్టుకుని విల్ యూ మ్యారీ మీ అంటూ అర్జించాడు. దానికి ఆమె ఇచ్చిన రిప్లై ఏంటంటే?

మ్యాచ్ జరుగుతుండగానే ఓ లేడీ క్రికెటర్ కు ఫ్యాన్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. ప్లకార్డు పట్టుకుని విల్ యూ మ్యారీ మీ అంటూ అర్జించాడు. దానికి ఆమె ఇచ్చిన రిప్లై ఏంటంటే?

లైవ్ మ్యాచ్ లో లేడీ క్రికెటర్ కు పెళ్లి ప్రపోజల్.. రిప్లై ఏంటంటే?

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరుగుతుంటే.. కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సరదాగా ఉంటే.. మరికొన్ని ఉద్రిక్తలకు దారితీస్తాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే.. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే లవ్ అండ్ మ్యారేజ్ ప్రపోజల్స్ లెక్కలేనన్ని కనిపిస్తూ ఉంటాయి. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఓ లేడీ క్రికెటర్ కు వీరాభిమాని పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఆ లేడీ క్రికెటర్ ఎవరు? ఆ సంగతులు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం మహిళా ప్రీమియర్ లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ లో భాగంగా మంగళవారం(ఫిబ్రవరి 27)న గుజరాత్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. ఆర్సీబీ టీమ్ కు చెందిన ఓ అందమైన లేడీ క్రికెటర్ కు మ్యాచ్ జరుగుతుండగానే మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. ఓ వీరాభిమాని ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ‘విల్ యూ మ్యారీ మీ శ్రేయాంక పాటిల్’ అని రాసిన ప్లకార్డులో రెడ్ హార్ట్ సింబల్ కూడా ఉంది. ఆ ప్రపోజల్ పెట్టింది ఎవరికో తెలుసా? ఆర్సీబీకి చెందిన ప్లేయర్ శ్రేయాంక పాటిల్ కు. ఓ యువకుడు ఇలా ప్లకార్డు పట్టుకుని ఆమెను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు.

ఇక ఈ సీన్ బిగ్ స్క్రీన్ పై కనిపించగానే డగౌట్ లో కూర్చున్న ఆర్సీబీ ప్లేయర్లు నవ్వులు చిందించారు. శ్రేయాంక కూడా చిన్న స్మైల్ తో తన రిప్లైని ఇచ్చింది. ఈ ప్లకార్డులో అతని పేరు కన్నడలో ఉంది. దీన్ని బట్టి ప్రపోజ్ చేసిన యువకుడు స్థానికుడే  అని తెలుస్తోంది. చాలా రోజుల నుంచి ఆమెను ఫాలోఅవుతున్నాడేమో బహుశా. ఇక  ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. లేడీ ఫ్యాన్స్ పురుష క్రికెటర్లకు లవ్, మ్యారేజ్ ప్రపోజల్స్ చేయడం మనం చాలాసార్లే చూశాం. కానీ చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే లేడీ క్రికెటర్లకు ఇలాంటి ప్రపోజల్స్ వస్తుంటాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ టీమ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలో మ్యాచ్ ను ముగించింది. మరి ఈ మ్యారేజ్ ప్రపోజల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: సిరీస్ ఓటమి.. కొండకు నిచ్చెన వేసే మాటలు మాట్లాడిన మెక్ కల్లమ్!