iDreamPost

దేశంలోని ప్రముఖ శివాలయాలు.. వాటి ప్రత్యేకతలు!

భారత దేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆలయ నిర్మాణాల్లో శిల్పులు సృజనాత్మకత కనిపిస్తుంది. కనీ వినీ ఎరుగని రీతిలో ఆయల నిర్మాణాలు చేపట్టారు.

భారత దేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆలయ నిర్మాణాల్లో శిల్పులు సృజనాత్మకత కనిపిస్తుంది. కనీ వినీ ఎరుగని రీతిలో ఆయల నిర్మాణాలు చేపట్టారు.

దేశంలోని ప్రముఖ శివాలయాలు.. వాటి ప్రత్యేకతలు!

భారత దేశం ఎన్నో అద్భుతమైన దేవాలయాలకు, శిల్పాలకు, కట్టడాలకు పుట్టినిల్లుగా చెబుతుంటారు. ముఖ్యంగా ఆలయాల విషయానికి వస్తే.. హిందూ వాస్తుశిల్పం ప్రధాన రూపంగా ఎన్నో రకాల శైలిని కలిగి ఉంది. భారత దేశంలో ఎక్కువా శివాలయాలు ఉన్నాయని అంటుంటారు. శివుని ఆదేశం లేనిదే చీమైనా కుట్టదని.. ఆయన పేరుతో దేశ వ్యాప్తంగా గ్రామా గ్రామంలో శివాలయాలు నిర్మించి భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో కొలుస్తుంటారు. మహాశివుడికి కైలాస నాథుడు, బోలేనాథుడు, కాశీ విశ్వనాథుడు, సోమనాథుడు, బైద్యనాథ, అమర్ నాథ స్వామి, బద్రినాథ, రామనాథ తో పాటు ఇంకా అనేక పేర్లతో కొలుస్తుంటారు. భారత దేశంలో ఎక్కువగా శివ అనే పేరు వినిపిస్తుంటుంది. ఇక మహాశిరాత్రి పండుగ రోజు ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతాయి. మన దేశంలో అత్యంత ప్రసిద్ది చెందిన శివాలయాల గురించి తెలుసుకుందాం.

కైలాస నాథుడు : మహారాష్రలో ఎంతో ప్రసిద్ది చెందిన ఆలయంలో ఒకటి కైలాస నాథ ఆలయం. దీని విశిష్టత ఏంటేంటే.. ఒకే రాతిపై చెక్కబడిన ఏక శిల దేవాలయం. ఇది ఎనిమిదవ శతాబ్ధం నాటి కట్టడం. భారతీయుల అద్భుత నిర్మాణ నైపుణ్యానికి ఇది నిదర్శనం అంటారు. ఈ ఆలయాన్ని శివ భక్తుడైన క్రిష్ణుడు అనే మహరాజు నిర్మించారని చరిత్ర చెబుతుంది. కృష్ణుడు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఎలాంటి వైద్యం కూడా ఆయనను నయం చేకలేకపోయాయి.. ఆ సమయంలో ఆయన భార్య కైలాస నాథుని ఆలయంలో మహాశివుడిని పూజించడం తో మహరాజు ఆరోగ్యం కుదుట పడింది. అందుకే ఆయన ఈ అద్భుత ఆలయ నిర్మాణం చేపట్టారు అని చరిత్ర కారులు అంటారు.

బైద్యనాథ్ : జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ శివాలయం బైధ్యనాథ మందిరం. దేశంలో ప్రముఖ శివాలయంగా ప్రసిద్ది గాంచింది. ఇక్కడ మహాశివరాత్రి రోజు భారీగా ఊరేగింపులు జరుగుతాయి. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని రావణబ్రహ్మ నిర్మించినట్లు చెబుతుంటారు. రావణాసురుడు.. గొప్ప శివ భక్తుడు. శివుడి గురించి తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు.. కానీ దాన్ని నేలపై ఉంచరాదు. కానీ వినాయకుడు చేసిన పనికి ఆ లింగం నేలపై పెట్టినట్టుగా ఆ స్థలంలోనే బైద్యనాథ్ ఆలయం ఏర్పడిందని చరిత్ర కారులు చెబుతున్నారు.

లింగరాజు : దక్షణ భారత దేశంలో ఎంతో ప్రసిద్ద పొందిన ఆలయాల్లో ఒకటి లింగరాజు ఆలయం. ఇది ఆరవ శతాబ్ధంనాటిది. మరికొంతమంది ఇది 11వ శతాబ్ధానికి చెందినదిగా చెబుతుంటారు. ఈ ఆలయం చాలా ఎత్తులో నిర్మించబడింది. దీని నిర్మాణం అంతా ముదురు రంగు రాళ్లతో నిర్మించారు. డ్యూలా శైలిలో నిర్మించిన ఇసుకరాయిని నిర్మాణం నేటికి ఎంతో బలంగా కనిపిస్తుంది. ఈ గుడిలోని నీటి ప్రవాహం ఇప్పటికీ ఓ రహస్యం అంటారు. ఈ జాలాల్లో ఎంతో ప్రత్యేకత ఉందని స్థానికులు చెబుతుంటారు. ఈ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ సమీపంలో ఉంది.

కోటి లింగేశ్వరుడు : దేశంలో కోటిలింగాల క్షేత్రం ఎంతో ప్రసిద్ది గాంచింది. ఇక్కడ ఎక్కడ చూసినా శివలింగాలే దర్శనం ఇస్తుంటాయి. 1972లో మొట్టమొదటి లింగాన్ని ప్రతిష్టించినట్లుగా చరిత్ర చెబుతుంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది మహాశివరాత్రి రోజు కొత్త లింగాలను ప్రతిష్టిస్తూ వచ్చారు. కోటి లింగేశ్వర ఆలయంలో సుమారు 11 దేవాలయాలు ఉంటాయి. ఇందులో ఒక శివలంగం ఏకంగా వంద అడుగుల ఎత్తు ఉంది. కర్ణాటకలో రాష్ట్రంలోని కోలార్ జిల్లా కమ్మసంద్ర గ్రామంలో ఉంది.

శ్రీ కైలాస నాథుడు: దక్షిణ భారత దేశంలో ప్రసిద్ద శైవ క్షేత్రం కైలాసగిరి. కైలాస నాథుడి ఆలయం ఉండటం వల్ల ఆ ప్రాంతానికి కైలాసగిరి అనే పేరు వచ్చింది. ఓంకార స్వామిజీ అనే వ్యక్తి తన తపో శక్తి దారపోసి 1951 జనవరి 21న కైలాసనాథుని శివలింగాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ది చెందింది. ఎంతోమంది భక్తులు ఇక్కడ శివపార్వతులను చూసి తరించిపోతుంటారు. ఈ ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షణలు చేస్తే కోరుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతాయని అంటారు. కైలాసగిరి విశాఖపట్నం సాగరతీరంలో ఉంది.

కాశీ విశ్వనాథ్ ఆలయం: ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న ఈ ప్రాంతాన్ని శివుడి మరో రూపం విశ్వనాథునికి అంకితం చేయబడిందని అంటుంటారు. పవిత్రమైన గంగానదిలో స్నానం చేసి శివునికి ప్రార్థనలు చేస్తారు. సాధారణంగా ఎవరైనా చల్లగా బతకడానికి పూజలు, యాగాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం చనిపోవాలని కోరుకుంటూ జీవనం గడుపుతుంటారు.. ఎందుకంటే ఈ ప్రాంతంలో చనిపోతే ఎంతో పుణ్యం అంటుంటారు. ఇక్కడు ఉన్న ఘట్లలో నిత్యం చనిపోయిన వారి అస్తికలు, బుడిద కలిపేందుకు వస్తుంటారు. దీని వల్ల తమ పూర్వికుల ఆత్మ శాంతిస్తుందని నమ్ముతారు.

సోమనాథుడి ఆలయం: గుజరాత్ లో ఉన్న ఈ ఆలయానికి.. భారత చరిత్రకు ఎంతో అవినాభ సంబంధం ఉంది. ఈ ఆలయంలో ఒకప్పుడు అపారమైన సంపద కలిగి ఉండేదని, మధ్య యుగంలో ఈ గుడిపై కొంతమంది పదే పదే దాడులు చేసి సంపద మొత్తం ఎత్తుకు వెళ్లారని చరిత్ర చెబుతుంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అంటారు. ఈ ఆలయంలో శివుడిని సోముడు అని అంటారు. ‘సోమ’వారానికి సోమనాథుడిగా ఓ సంబంధం ఉందని అంటుంటారు. అందుకే శివుడికి అత్యంత ఇష్టమైన వారం సోమవారం.. అందుకే శివ భక్తులు సోమవారం ఒక్కపొద్దు.. పూజలు నిర్వహిస్తుంటారు.

అమర్ నాథ్ ఆలయం:  అమర్‌నాథ్ గుహ భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన శివాలయం, ఇది జమ్మూ కాశ్మీర్‌లో ఉంది. దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మందిరం హిందూమతం విశిష్టత చాటిచెబుతుంది.  ఈ గుహ చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు ఉన్నాయి, యాత్రికుల కోసం తెరిచే వేసవి కాల సమయంలో తెరుస్తుంటారు. మిగతా సమయం దాదాపు గరిష్టంగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ప్రతి సంవత్సరం భక్తులు అమర్‌నాథ్ తీర్థయాత్ర  చేస్తున్నారు. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి