iDreamPost
android-app
ios-app

తన చావుకు తానే ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్ నటి

Shannen Doherty Tears Up: ప్రముఖ నటి కన్నీటిపర్యతమైంది. తన తల్లికంటే ముందే తాను చనిపోబోతున్నాను అంటూ కామెంట్స్ చేసింది. తనకు వచ్చిన కష్టం, తన తల్లి విషయంలో తనకున్న బాధ్యతకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది.

Shannen Doherty Tears Up: ప్రముఖ నటి కన్నీటిపర్యతమైంది. తన తల్లికంటే ముందే తాను చనిపోబోతున్నాను అంటూ కామెంట్స్ చేసింది. తనకు వచ్చిన కష్టం, తన తల్లి విషయంలో తనకున్న బాధ్యతకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది.

తన చావుకు తానే ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్ నటి

కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటు జీవితం.. అనే విషయం అందరికీ తెలుసు. ఈ జీవితం ఎప్పుడు ఎలా మొదలవుతుందో ఎలా ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ, కొందరికి మాత్రం తమ మరణంపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. తాము చనిపోబోతున్నాం అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. అలా తెలుసుకున్నాక మిగిలిన కొద్ది రోజులను తన వాళ్లతో గడుపుతూ ఉంటారు. అయితే ఇది అందరికీ తెలిసే విషయం కాదు. కానీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి తమ మరణానికి సంబంధించి ముందే సంకేతాలు అందుతాయి. శరీరం ఇంక సహకరించలేను అని చెప్పేస్తుంది. అలాంటి ఒక విషాదకర పరిస్థితుల్లోనే ఇప్పుడు ఒక ప్రముఖ నటి ఉంది. తన చావుకు తానే ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది.

ఆ నటి మరెవరో కాదు.. షానెన్ డోహర్టీ. తాను ఎక్కువ రోజులు బతకనని ఆమె స్వయంగా వెల్లడించింది. తాజాగా లెట్స్ బీ క్లియర్ అనే పాడ్ కాస్ట్ లో తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించడమే కాకుండా.. తాను ఎక్కువ రోజులు బతకను అంటూ చెప్పింది. ఈ పాడ్ కాస్ట్ తన జ్ఞాపకాలు, బాధ్యతల గురించి కూడా వ్యాఖ్యలు చేసింది. ఆమె ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్ తో పోరాడుతోంది. అది నాలుగో స్టేజ్ లో ఉంది. షానెన్ డోహెర్టీకి 2015లో క్యాన్సర్ సోకింది. ఆ తర్వాత అది తగ్గిపోయింది. మళ్లీ 2017లో తనకి క్యాన్సర్ సోకిన విషయాన్ని ఆమె వెల్లడించింది. ఆ తర్వాత 2020లో మరింత వ్యాపించిన క్యాన్సర్.. 2023లో మెదడు, ఎముకలకు కూడా వ్యాపించినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

తాజాగా తాను బతికేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పింది. ఇన్ఫ్యూజన్ అనే చికిత్స గురించి కూడా వివరించిన డోహెర్టీ.. తన భవిష్యత్ పై ఆశాభావం వ్యక్తం చేసింది. తనకు ప్రస్తుతం ఒకే ఒక బాధ్యత ఉందని వెల్లడించింది. తన తల్లికంటే ముందు తాను ప్రాణాలు విడవడంపై విచారం వ్యక్తం చేసింది. తల్లిని చూసుకోవాల్సిన తాను.. ఇలా ఆమె కళ్ల ముందే మరణిచడంపై ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత తనదేని స్పష్టం చేసింది. ఇప్పుడు ఆమె జీవితాంతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించేందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటోంది.

షానెన్ డోహెర్టీ తన పేరిట ఉన్న ఆస్తులను విక్రయించడం, తాను ఇన్నాళ్లు సేకరించిన పురాతన వస్తువులను విక్రయించడం లేదా విరాళంగా ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపింది. తనకు వీలైనంత వరకు తన తల్లికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలాగే షానెన్ డోహెర్టీ తన అంత్యక్రియలకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేసుకుంటోంది. తాను పోయిన తర్వాత ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేలా ఆమె ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్లు చెప్తున్నారు. షానెన్ డోహెర్టీ చిన్న వయసులోనే యాక్టిగ్ మొదలు పెట్టింది. పదేళ్ల వయసులో 1981లో ‘ఫాదర్ మర్ఫీ’ అనే టీవీ షోతో తన కెరీర్ ని ప్రారంభించింది. అందులో కేవలం గెస్ట్ రోల్ ప్లే చేసినా తర్వాత మంచి అవకాశాలు దక్కాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు షానెన్ డోహెర్టీ ఒక నటిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇప్పుడు షానెన్ డోహెర్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetBetebetkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Giriş