iDreamPost

ఈయనకే దిక్కులేదు.. బట్టతలపై జుట్టు మొలిపిస్తాడట.. చివరికి ఏమైందంటే?

బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని మోసాలకు పాల్పడుతున్నాడు ఓ డాక్టర్. అతడి నిర్వాకం వల్ల లేని సమస్యలు కొని తెచ్చుకున్నారు బాధితులు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని మోసాలకు పాల్పడుతున్నాడు ఓ డాక్టర్. అతడి నిర్వాకం వల్ల లేని సమస్యలు కొని తెచ్చుకున్నారు బాధితులు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఈయనకే దిక్కులేదు.. బట్టతలపై జుట్టు మొలిపిస్తాడట.. చివరికి ఏమైందంటే?

ప్రస్తుత కాలంలో అందరినీ వేధిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అది జుట్టురాలే సమస్య మాత్రమే. వయసుతో సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ అవుతుంది. మారుతున్న జీవన శైలి.. తీసుకునే ఆహారం ఇంకా ఇతర కారణాలు జుట్టురాలడానికి దారితీస్తున్నాయి. 30 ఏళ్లు నిండక ముందే కొంతమందికి బట్టతల వచ్చేస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు మార్కెట్ లో దొరికే హెయిర్ గ్రోత్ ప్రాడక్స్ట్ ను ఉపయోగిస్తున్నారు. మరికొంత మంది హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. కాగా ఇలాంటి వారిని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఇదేవిధంగా ఓ నకలీ వైద్యుడు బట్టతలపై జుట్టు మొలిపిస్తానని ఫ్రాడ్ చేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదుతో ఇతగాడి బండారం బయటపడింది. చివరికి ఏమైందంటే?

జుట్టు లేదని బాధపడుతున్నారా? ఇక మీకు ఎలాంటి చింత అవసరం లేదు.. మీ బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ హెయిర్ ప్లాంటేషన్ సెంటర్లు ప్రచార హోరెత్తించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వారిని ఆశ్రయించి జుట్టు పెరుగుడు దేవుడెరుగేమోగాని లేని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు బట్టతల బాధితులు. ఇదీకాక కొంతమంది నకిలీ వైద్యుల నిర్వాకం వల్ల లేని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లే వారు. ఇదే విధంగా హైదరాబాద్ నగరంలో సులభంగా డబ్బు సంపాదించేందుకు డాక్టర్ గా అవతారమెత్తిన ఓ వ్యక్తి బట్టతలపై జుట్టు మొలిపిస్తానని మోసం చేస్తున్నాడు. ఆ వ్యక్తిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్ లో అస్లాం అనే వ్యక్తి బట్టతలపై వెంట్రుకలు తెప్పిస్తానంటూ ఓల్డ్ సిటీలో క్లినిక్ ఓపెన్ చేశాడు. అయితే ఈయన గతంలో గచ్చిబౌలిలోని ఓ హెయిర్ ట్రాన్సప్లాంటేషన్ హాస్పిటల్ లో రిసెప్షనిస్ట్ గా పని చేశాడు. ఆ సమయంలో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ పై కొద్దీగా అవగాహన పెంచుకున్నాడు. ఆ తర్వాత ఈజీగా డబ్బులు సంపాదించేందుకు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో అస్లాం దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నకిలీ డాక్టర్ అస్లాంను అరెస్టు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి