iDreamPost

బంతితో పరిగెత్తిన బ్యాటర్.. వెంటపడ్డ కీపర్! వైరలవుతున్న వీడియో

  • Author Soma Sekhar Published - 12:51 PM, Wed - 19 July 23
  • Author Soma Sekhar Published - 12:51 PM, Wed - 19 July 23
బంతితో పరిగెత్తిన బ్యాటర్.. వెంటపడ్డ కీపర్! వైరలవుతున్న వీడియో

క్రికెట్ మ్యాచ్ ల్లో కయ్యానికి కాలుదువ్వే సంఘటనలే కాదు.. అప్పుడప్పుడు కడుపుబ్బా నవ్వే సన్నివేశాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ సన్నివేశాలను చూస్తే.. ఎంత ట్రై చేసినా నవ్వు అపుకోలేరు. తాజాగా అలాంటి ఫన్నీ మూమెంటే శ్రీలంక-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో చోటుచేసుకుంది. రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. శ్రీలంకలోని గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో ఈ ఫన్నీ మూమెంట్ జరిగింది. ఈ సరదా సన్నివేశానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

శ్రీలంక-పాకిస్థాన్ మధ్య గాలె వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఓ కడుపుబ్బా నవ్వే సన్నివేశం చోటుచేసుకుంది. పాక్ తొలి ఇన్నింగ్స్ లో 120వ ఓవర్ లో ఫన్నీ మూమెంట్ అందర్ని నవ్వించింది. పాక్ తొలి ఇన్నింగ్స్ లో చివరి బ్యాటర్ అయిన అబ్రార్ అహ్మద్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే లంక స్పిన్నర్ రమేష్ మెండిస్ బౌలింగ్ కు వచ్చాడు. ఈ ఓవర్లో మెండిస్ వేసిన బంతిని అబ్రార్ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దాంతో బంతి టర్న్ అయ్యి అతడి గ్లవ్ కు తాకి ప్యాడ్ లో చిక్కుకుంది.

ఈ క్రమంలోనే అది గమనించిన లంక వికెట్ కీపర్ సదీర సమరవిక్రమ బంతికి పట్టుకునేందుకు వచ్చాడు. ఇది చూసిన అబ్రార్ అతడికి ఆ అవకాశం ఇవ్వకుండా.. పక్కకు జరుగుతూ.. క్రీజ్ నుంచి కొంత దూరం వెళ్లాడు. అయినా లంక కీపర్ వెంటపడి మరీ ప్యాడ్ లో చిక్కుకున్న బంతిని తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి కిందపడింది. దాంతో అవుట్ అవుతానని క్రీజ్ లోకి పరిగెత్తుకొచ్చాడు అబ్రార్. ఇక అబ్రార్ సైతం పెద్దగా నవ్వుతూ కనిపించాడు. ఇక ఈ సన్నివేశం చూసి డగౌట్ లో ఉన్న క్రికెటర్లు నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 312 పరుగుల చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులతో ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. పాకిస్థాన్ తన తొలి ఇన్నింగ్స్ లో 461 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీలంక ఇంకా 56 పరుగులు వెనకబడి ఉంది.


ఇదికూడా చదవండి: గ్రాండ్ స్లామ్ టైటిళ్లే కాదు.. జరిమానాల్లో కూడా జకోవిచ్ రికార్డే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి