iDreamPost

జేసీ హత్యా ఆరోపణలు.. లక్ష్యం అదేనా..?

జేసీ హత్యా ఆరోపణలు.. లక్ష్యం అదేనా..?

తాడిపత్రిలో రాజకీయాన్ని జేసీ ప్రభాకర్‌ రెడ్డి కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. లేనిపోని వివాదాలు రేపి, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలను జేసీ ప్రభాకర్‌ రెడ్డి చేస్తున్నారనే వ్యాఖ్యలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఆయన వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని హత్యా ఆరోపణలు చేశారని తెలుస్తోంది. తనను చంపించే ందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ జేసీ ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడడం చర్చనీయాంశమైంది. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌ ఫ్యాక్షన్‌ రాజకీయం తెలిసిన వారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి వ్యాఖ్యలను లైట్‌ తీసుకుంటున్నారు.

ఇటీవల అక్రమంగా వాహనాలు విక్రయించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి… ఆ తర్వాత నియోజకవర్గంలో సానుభూతి పొందేందుకు, అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పెద్దారెడ్డి, అతని కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, సోషల్‌ మీడియాలో చేయిస్తున్నారనే అంశంపై వివాదం నెలకొంది. ఈ క్రమంలో జేసీని నిలదీసేందుకు పెద్దారెడ్డి ఆయన ఇంటికి వెళ్లడం, అక్కడ జరిగిన రాళ్లదాడితో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటన తర్వాత జేసీ ప్రభాకర్‌ రెడ్డి భయపడ్డారా..? లేక ఈ ఘటన ఆధారంగా ప్రభుత్వంలోని ముఖ్యులపై ఆరోపణలు చేస్తున్నారా..? అనే చర్చ సాగుతోంది.

ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ఇంటికి వెళ్లడానికి ప్రభాకర్‌ రెడ్డే కారణం అని స్పష్టంగా తెలుస్తోంది. ఒక ఎడ్లబండి ఇసుకకు పెద్దారెడ్డి సతీమణి పదివేల రూపాయలు వసూలు చేస్తున్నారంటూ ఫేక్‌ ఆడియోకాల్‌ సృష్టించి దాన్ని సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. ఇది జేసీ ఇంట్లో ఉన్న అతని అనుచరులే చేశారని పెద్దారెడ్డి వర్గం బలంగా అనుమానిస్తోంది. ఇదే పెద్దారెడ్డి.. జేసీ ఇంటికి వెళ్లేలా చేసింది. ఇద్దరి మధ్య జరిగిన గొడవను ప్రభుత్వానికి, సీఎం వైఎస్‌ జగన్‌నుకు పరోక్షంగా అంటించాలనే సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు చేశారనేది జేసీ రాజకీయ తీరును గమనించే వారు చెబుతున్నారు. మరి ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఏమి సాధించాలనుకుంటున్నారో.. కాలమే తేల్చాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి