iDreamPost

మోజు తీర్చుకుని మొహం చాటేసిన TDP నేత!

ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి మోసం చేసే కేటుగాళ్లు ఎక్కువయ్యారు. ప్రేమ పేరుతో లోబర్చుకుని మోజు తీరగా మొహం చాటేస్తున్నారు. ఇలా మోసపోయిన యువతులు కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ప్రేమ పేరుతో మరో యువతి కూడా మోసపోయింది.

ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి మోసం చేసే కేటుగాళ్లు ఎక్కువయ్యారు. ప్రేమ పేరుతో లోబర్చుకుని మోజు తీరగా మొహం చాటేస్తున్నారు. ఇలా మోసపోయిన యువతులు కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ప్రేమ పేరుతో మరో యువతి కూడా మోసపోయింది.

మోజు తీర్చుకుని మొహం చాటేసిన TDP నేత!

ప్రేమ అనే పదానికి ఎంతో విలువ ఉంది. అయితే  ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో జరగుతున్న మోసాలు ఎక్కువయ్యాయి. లవ్ పేరుతో యువతులను  మోసం చేసే కేటుగాళ్లు ఎక్కువయ్యారు. మాయ మాటలు చెప్పి…లోబర్చుకుని మోజు తీర్చుకున్నాకా మొహం చాటేస్తున్న దొంగ ప్రేమికులు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారిలో రాజకీయ నేతలుగా చలమణి అయ్యే వారు కూడా ఉన్నారు. తాజాగా ఓ టీడీపీ నేత యువతిని ప్రేమ పేరుతో లోబర్చుకుని చివరకు మోసం చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలుతెలిపిన వివరాల ప్రకారం..

సోమవారం అనంతపురం పోలీసు కార్యాలంయోల స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ లో జిల్లా ఎస్పీ అన్బురాజన్ కి  ఓ యువతి..తనకు జరిగిన అన్యాయం గురించి తెలిపింది. ఇక ఎస్పీ సూచన మేరకు తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని 30వ వార్డు కౌన్సిలర్‌ గా కొత్తపల్లి మల్లికార్జున  ఉన్నారు. ఆయన తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరుడు. టౌన్ లోని సీపీఐ కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. సదరు యువతిని ఆమె ఇంటి నుంచి తీసుకొచ్చి తనకు తెలిసిన వారి ఇంట్లో ఉంచాడు.

అనంతరం ఆమెతో కొంతకాలం సహజీవనం చేశాడు. యువతి రెండు సార్లు గర్భం దాల్చింది. అయితే తమకు ఇప్పుడే పిల్లలు ఎందుకు అంటూ అబార్షన్‌లు కూడా చేయించాడు. కొన్ని రోజుల నుంచి ఆ యువతిని దూరంగా పెడుతుండటంతో ఆమెకు అనుమానమొచ్చింది. దీంతో మల్లికార్జున సెల్‌ఫోన్‌ పరిశీలించగా, వాట్సాప్‌లో మరో మహిళతో చాటింగ్‌ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే వివాహం చేసుకోమని ప్రశ్నిస్తే తీవ్రంగా కొట్టాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. తాను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తనతోనే జీవితం అంటూ చెప్పాడు. తనకు జరిగిన అన్యాయాన్ని మల్లికార్జున కుటుంబ సభ్యులకు వివరించింది. సర్దిచెప్పాల్సిన వారు కూడా దౌర్జన్యం చేసి.. యువతిని పంపించారు.

దీంతో తాను మోసపోయానని యువతి మానసికంగా కుమిలికుమిలి పోయింది. సోమవారం అనంతపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని స్పందన కార్యక్రమంలో తన గోడు వెళ్లబోసుకుంది. ఆయన సూచన మేరకు తాడిపత్రి పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో తనలాంటి వారి జీవితాలతో ఆటలాడుతున్న మల్లికార్జునపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది. తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యే దిక్కని బాధితురులు ఆవేదన వ్యక్తం చేసింది. మరి.. ఇలా  ప్రేమ పేరుతో మోసం చేసే కేటుగాళ్లకు ఎలాంటి శిక్ష విధించాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి