iDreamPost

జై జగన్ అంటున్న శిద్దా కుటుంబం

జై జగన్ అంటున్న శిద్దా కుటుంబం

ప్రకాశం జిల్లాకి చెందిన మాజీమంత్రి శిద్దా రాఘవరావు సోదరుడి అన్న కుమారుడు శిద్దా హనుమంతరావు ఆదివారం ఉదయం బాలినేని సమక్షంలో మంత్రి బాలినేని స్వగృహంలో వైసిపిలో చేరారు. గతంలో చంద్రబాబు క్యాబినెట్ లో శిద్దారాఘవ రావు ప్రధాన శాఖలు నిర్వహించారు. గత ప్రభుత్వంలోశిద్దా రాఘవరావు జిల్లా రాజకియాలని చక్రం తిప్పారు. జిల్లాలో ఎవరికీ ఇవ్వనంతగా చంద్రబాబు కుడా రాజకీయంగా ఆయనకి అమిత ప్రాధాన్యత ఇచ్చారు.

కాగా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రానైట్ తవ్వకాలలో గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, గత ప్రభుత్వంలో కొంత మంది ప్రజా ప్రతినిధులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ్రానైట్ తవ్వకాలలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో మైనింగ్ అధికారులు గ్రానైట్ క్వారిల్లొ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో కొందరు క్వారి యజమానులు తవ్వకాలలో పెద్ద ఎత్తున నిభంధనలను ఉల్లంఘించారని నిగ్గుతేల్చారు.

నిభంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై కొరడా జులిపించిన మైనింగ్ అధికారులు మంత్రి శిద్దా రాఘవరావు, అతని కుటుంబసభ్యుల క్వారీలతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులపై భారీ ఎత్తున అపరాధ రుసుము విధిస్తూ మైనింగ్ యాజమాన్యాలకు నోటీసులు అందించారు. ఈ పరిణామంతో జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ యజమానులలో తీవ్ర ఆందోళన నెలకుంది. మైనింగ్ శాఖ విధించిన ఫైన్ నుండి తప్పించుకోవడానికి గ్రానైట్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర భారీ ఎత్తున పైరవీలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఈ పరిణామాలతో జిల్లాలో అనేక సంవత్సరాలుగా కుటుంబసభ్యులతో కలసి గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తున్న శిద్దా రాఘవరావుగతకొంతకాలంగా రాజకీయాలకు దూరంగా స్తబ్దుగా ఉంటున్నాడు. ఇటీవల కాలంలో తెలుగుదేశం కార్యక్రమాలకు కూడా పాల్గొనడం లేదు. అయితే గతవారం తెలుగుదేశం సీనియర్ నాయకుడు కరణం బలరాం టీడీపీని వీడి వైసిపి కండువా కప్పుకోవడంతో ఒక దశలో శిద్దా రాఘవరావు కూడా టీడీపీని వీడుతున్నారని ప్రచారం జరిగినప్పటికీ, అయన చంద్రబాబుని కలసి వివరణ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. శిద్దా మాత్రం తానూ తెలుగుదేశంలోనే కొనసాగుతున్నానని ముక్తసరిగా సమాధానం ఇచ్చి వెళ్ళిపోయాడు. అయితే అయన తెలుగుదేశంలో కొనసాగాలావద్దా అనే అంశంలో తీవ్ర తర్జనభర్జన పడుతున్నాడని సన్నిహితులంటున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి శిద్దా కుటుంబం ఇప్పుడు వైసిపి బాట పట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి