iDreamPost

మోదీ సర్కార్‌ కొత్త స్కీమ్‌.. టూవీలర్‌, త్రీ వీలర్‌ కొనుగోళ్లపై భారీ రాయితీ

  • Published Mar 14, 2024 | 9:59 AMUpdated Mar 14, 2024 | 9:59 AM

EV Subsidy Scheme: 2, 3 వీలర్‌ కొనుగోలు చేయాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త స్కీమ్‌ను ప్రకటించింది. టూవీలర్‌, త్రీవీలర్‌ కొనుగోళ్లపై భారీ రాయితీ ప్రకటించింది. ఆ వివరాలు..

EV Subsidy Scheme: 2, 3 వీలర్‌ కొనుగోలు చేయాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త స్కీమ్‌ను ప్రకటించింది. టూవీలర్‌, త్రీవీలర్‌ కొనుగోళ్లపై భారీ రాయితీ ప్రకటించింది. ఆ వివరాలు..

  • Published Mar 14, 2024 | 9:59 AMUpdated Mar 14, 2024 | 9:59 AM
మోదీ సర్కార్‌ కొత్త స్కీమ్‌.. టూవీలర్‌, త్రీ వీలర్‌ కొనుగోళ్లపై భారీ రాయితీ

ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం ఓటర్లను ఆకట్టుకోవడం కోసం రకరకాల పథకాలను, స్కీమ్‌లను ప్రకటిస్తోంది. ఇప్పటికే గ్యాస్‌ ధరను రెండో సారి తగ్గించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఓటర్లను ఆకర్షించడం కోసం కొత్త స్కీమ్‌లను కూడా ప్రకటించేందుకు రెడీ అవుతోంది మోదీ సర్కార్‌. దీనిలో భాగంగా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా టూవీలర్‌, త్రీవీలర్‌ కొనుగోళ్లపై భారీ స్థాయిలో రాయితీలు కల్పిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయలతో ఇందుకోసం ఓ స్కీమ్‌ను ప్రకటిచంనుంది. దాని వివరాలు..

మోదీ సర్కార్‌ టూవీలర్‌, త్రీవీలర్‌ వాహనాల కొనుగోళ్లపై భారీ రాయితీ ప్రకటించేందుకు రెడీ అవుతోంది. అయితే అవి సాధారణ వాహనాలు కాదు.. విద్యుత్ వాహనాలు. ఈవీల కొనుగోలును ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌కు శ్రీకారం చుట్టింది. విద్యుత్‌ వాహనాల కొనుగోళ్ల మీద భారీ ఎత్తున సబ్సిడీ అందించేందుకు ఇ-మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఈఎంపీఎస్‌ 2024) ను ప్రారంభించనుంది. ఈ మేరకు బుధవారం నాడు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ స్కీమ్ కోసం ఏప్రిల్ నుంచి 4 నెలల కోసం రూ. 500 కోట్ల మేర కేటాయించినట్లు మహేంద్రనాథ్ పాండే స్పష్టం చేశారు. భారత్‌లో ఇ-మొబిలిటీని ప్రోత్సహించడానికి ప్రధాని మోదీ సర్కార్ కట్టుబడి ఉందని.. దీంట్లో భాగంగానే ఇప్పుడు కొత్త స్కీమ్ తీసుకొచ్చినట్లు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త స్కీమ్ కింద విద్యుత్ ద్విచక్ర వాహనాలు (టూవీలర్స్), మూడు చక్రాల వాహనాలపై సబ్సిడీ ఇవ్వనున్నారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం తర్వాత.. 4 నెలల పాటు అమల్లో ఉంటుంది. ఈ లెక్కన 2024 జూలై వరకే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు మంత్రి పాండే.

ఇక ఈ స్కీమ్ కింద 3.3 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు గరిష్టంగా రూ. 10 వేల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. 31 వేల ఇ-రిక్షాలపై (చిన్న త్రిచక్ర వాహనాలు) రూ. 25 వేల సబ్సిడీ వస్తుంది. అదే పెద్ద త్రిచక్ర వాహనాలకు అయితే గరిష్టంగా రూ. 50 వేల మేర రాయితీ ఇచ్చేందుకు మోదీ సర్కార్‌ రెడీ అవుతోంది.

కేంద్రం గతంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీతో పాటు వినియోగాన్ని కూడా ప్రోత్సహించడం కోసమే తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ సెకండ్ ఫేజ్ (ఎఫ్‌ఏఎంఈ-ఐటీ) స్కీమ్ 2024 మార్చి 31తో ముగియనుంది. దీంట్లో భాగంగా టూవీలర్స్ సహా ఇతర విద్యుత్ వాహనాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ వచ్చింది. మరోసారి ఈ గడువు పెంచే యోచనలో లేదని తాజాగా స్పష్టం చేసిన కేంద్రం.. ఈవీల వినియోగం పెంచడం కోసం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి