iDreamPost

EPFO గుడ్ న్యూస్.. ఇక ఈజీగా మీ PF డబ్బులు డ్రా చేసుకోవచ్చు

EPFO New Rule: ఇటీవల ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తమ ఖాతాదారులకు సౌలభ్యం కోసం పలు మార్పులు తీసుకువస్తున్న విషయం తెలిసిందే.

EPFO New Rule: ఇటీవల ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తమ ఖాతాదారులకు సౌలభ్యం కోసం పలు మార్పులు తీసుకువస్తున్న విషయం తెలిసిందే.

EPFO గుడ్ న్యూస్.. ఇక ఈజీగా మీ PF డబ్బులు డ్రా చేసుకోవచ్చు

ఉద్యోగుల కోసం భారత ప్రభుత్వం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) స్కీమ్ ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా రిటైర్ మెంట్ బెనిఫిట్స్, వృద్దాప్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పథకాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ప్రతి ఉద్యోగి ఇందులో మెంబర్ కావొచ్చు. ప్రతి ఈపీఎఫ్ మెంబర్ కి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఎన్ఏ) కేటాయిస్తుంది. ప్రతి నెల ఎంప్లాయిస్ జీతం నుంచి పీఎఫ్ లో డబ్బు జమ అవుతుంది. మన అవసరాలకు వాటిని వాడుకునే అవకాశం ఉంటుంది. తాజాగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ కొత్త ఆర్తిక సంవత్సరంలో ఓ శుభవార్త చెప్పింది. ఇకపై పీఎఫ్ ఖాతాదారులు ఎవరిపై ఆధారపడకుండా వైద్య చికిత్స కోసం వారి ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చుని తెలిపింది. గతంలోఇది గరిష్ట పరిమితి రూ.50,000 మాత్రమే ఉండేది. ఇప్పుడు లక్ష రూపాయలవరకు పెంచింది. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ 16 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వచ్చింది.అలాగే ఏప్రిల్ 10న ఈపీఎఫ్ఓ అప్లికేషన్ కు సంబంధించిన సాఫ్ట్ వేర్ లో కూడా పలు మార్పులు చేసింది. ఈపీఎఫ్ఓ ఫారమ్ 31 లోని 68J పేరా కింద మనీ విత్ డ్రా పరిమితిని రెట్టింపు చేశారు. అయితే ఈపీఎఫ్ఓ ఫారమ్ 31 అనేది పాక్షిక ఉపసంహరణకు సంబంధించింది.

ఇది పలు ప్రయోజనాల కోసం డబ్బును అకస్మికంగా ఏదైనా అవసరాలు కలిగితే ఉపసంహరణకు ఉపయోగించబడుతుంది. ఇందుకు సంబంధించిన వేర్వేరు పనులు, వేర్వేరు పేరాల్లో ఉంచబడ్డాయి. ఇంటి నిర్మాణం, ఇల్లు కొనడం, చికిత్స కోసం డబ్బు తీసుకోవడం, వివాహం కోసం డబ్బు ఉపసంహరణ వంటివి ఇందులో ఉన్నాయి. ఉద్యోగి 6 నెలల బేసిక్, డీఏ లేదా వడ్డీతో సహా ఉద్యోగి వాటా ఉపసంహరణ చేయలేరు. పీఎఫ్ లో లక్ష ఎక్కువగా ఉంటే మాత్రమే దీన్ని క్లయిమ్ చేసుకోవచ్చు. ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఫారమ్ 31 నింపి సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ సర్టిఫికెట్ పై ఉద్యోగి, డాక్టర్ ఇద్దరి సంతకాలు తప్పని సరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి