iDreamPost
android-app
ios-app

క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న దిగ్గజ బౌలర్!

  • Published May 11, 2024 | 8:42 AM Updated Updated May 11, 2024 | 8:42 AM

హేమాహేమీ బ్యాటర్లను వణికించిన ఓ దిగ్గజ బౌలర్ టెస్ట్ క్రికెట్ కు త్వరలోనే వీడ్కోలు పలకబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ లెజెండ్ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

హేమాహేమీ బ్యాటర్లను వణికించిన ఓ దిగ్గజ బౌలర్ టెస్ట్ క్రికెట్ కు త్వరలోనే వీడ్కోలు పలకబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ లెజెండ్ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న దిగ్గజ బౌలర్!

ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది దిగ్గజ బౌలర్లు ఉన్నారు. షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, వసీం అక్రమ్, కపిల్ దేవ్, జహీర్ ఖాన్ ఇలా చెప్పుకుంటూ పోతే.. లిస్ట్ పెద్దదే అవుతుంది. అయితే వీరందరిలోకెల్లా ఓ బౌలర్ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే? అతడు వికెట్లు తీయడంలో ముందుటాడు.. వివాదాల్లో వెనకుంటాడు. అందుకే ఆ బౌలర్ అంటే సచిన్ టెండుల్కర్ తో పాటుగా ఎంతో మంది ఇష్టపడుతుంటారు. అలాంటి దిగ్గజ బౌలర్ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో క్రికెట్ లవర్స్ నిరాశకు గురవుతున్నారు. మరి ఆ లెజెండ్ ప్లేయర్ ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

జేమ్స్ అండర్సన్.. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ గానే కాకండా, ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ బౌలర్ గా ఘనమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా సంప్రదాయ క్రికెట్ అయిన టెస్ట్ ఫార్మాట్ లో లెక్కలేనన్ని రికార్డులను నెలకొల్పాడు. అండర్సన్ టీమ్ లో ఉన్నాడంటే.. ప్రత్యర్థి టీమ్ లో ఎంతటి మేటి ప్లేయర్ అయినా సరే.. ఆచితూచి ఆడాల్సిందే. తన ఇన్ అండ్ ఔట్ స్వింగ్ తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడంలో సిద్ధహస్తుడు అండర్సన్. ఇక టెస్టుల్లో ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డును తనపేరిట సువర్ణాక్షరాలతో లిఖించున్నాడు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్  చరిత్రలో 700 వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్ గా ఘనత వహించాడు.

ఇదిలా ఉండగా.. తాజాగా జేమ్స్ అండర్సన్ గురించిన ఓ షాకింగ్ న్యూస్ క్రికెట్ లవర్స్ ఆందోళనపెడుతోంది. అదేంటంటే? త్వరలోనే టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నాడట అండర్సన్. ఈ వేసవి కాలం ముగిసిన తర్వాత టెస్టులకు గుడ్ బై చెప్తాడని సమాచారం. ఈ విషయం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయం తెలియగానే రంగంలోకి దిగాడట ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్. అతడిని బుజ్జగించే పనిలో పడ్డాడట. ఇంగ్లండ్ క్రికెట్ భవిష్యత్ కోసం మరికొన్ని రోజులు క్రికెట్ ఆడాల్సింది మెక్ కల్లమ్ అండర్సన్ ను కోరినట్లు తెలుస్తోంది. అయితే  అండర్సన్ రిటైర్మెంట్ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక అండర్సన్ కెరీర్ విషయానికి వస్తే.. 187 టెస్టులు ఆడి 700 వికెట్లు, 194 వన్డేల్లో 269, 19 టీ20ల్లో 18 వికెట్లు తీశాడు. మరి టెస్ట్ క్రికెట్ కు అండర్సన్ గుడ్ బై చెప్పబోతున్నాడన్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Middle stump Cricket (@middle.stump.cric)