iDreamPost
android-app
ios-app

IND vs ENG: రెండో టెస్ట్ లో ఓటమి.. పర్యటన మధ్యలోనే దుబాయ్ కు ఇంగ్లాండ్! కారణం?

  • Published Feb 06, 2024 | 9:20 AM Updated Updated Feb 06, 2024 | 9:44 AM

రెండో టెస్ట్ లో ఓడిపోయిన ఇంగ్లాండ్ టీమ్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. పర్యటన మధ్యలోనే ఆ జట్టు దుబాయ్ వెళ్లనున్నట్లు సమాచారం. దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రెండో టెస్ట్ లో ఓడిపోయిన ఇంగ్లాండ్ టీమ్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. పర్యటన మధ్యలోనే ఆ జట్టు దుబాయ్ వెళ్లనున్నట్లు సమాచారం. దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

IND vs ENG: రెండో టెస్ట్ లో ఓటమి.. పర్యటన మధ్యలోనే దుబాయ్ కు ఇంగ్లాండ్! కారణం?

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా 106 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. దీంతో ఐదు టెస్ట్ ల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. టీమిండియా విధించిన 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది ఇంగ్లీష్ టీమ్. భారత బౌలర్ల ధాటికి 292 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోయిన ఇంగ్లాండ్ టీమ్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. పర్యటన మధ్యలోనే దుబాయ్ వెళ్లనున్నట్లు సమాచారం. దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రెండో టెస్ట్ లో ఓటమి తర్వాత ఇంగ్లాండ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు దుబాయ్ కు వెళ్లనుంది. దానికి పలు కారణాలు ఉన్నాయి. టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది. దీంతో దాదాపు 9 రోజుల లాంగ్ గ్యాప్ ఉండటంతో.. ఇంగ్లీష్ టీమ్ విశ్రాంతి కొరకు అక్కడికి వెళ్తోంది. ఇక వారి కుటుంబ సభ్యులు కూడా అటునుంచి అటే దుబాయ్ చేరుకుంటారని సమాచారం. కొన్ని రోజులు ఎంజాయ్ చేయడంతో పాటుగా.. అక్కడే ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలుస్తోంది.

England team to Dubai in the middle of the tour!

ఇండియాతో సిరీస్ ప్రారంభానికి ముందే దుబాయ్ లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ లో ప్రాక్టీస్ క్యాంప్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇదే గ్రౌండ్ లో ఆ జట్టు ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా స్పిన్ ట్రాక్ ను ఏర్పాటు చేసి.. ప్రాక్టీస్ చేస్తుందట. తిరిగి డైరెక్ట్ గా ఫిబ్రవరి 13న మూడో టెస్ట్ జరిగే రాజ్ కోట్ కు చేరుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. అర్ధాంతరంగా ఇలా దుబాయ్ కు ఇంగ్లీష్ టీమ్ వెళ్లడం వెనక మతలబు ఏంటో అర్థం కాట్లేదంటున్నారు క్రీడా పండితులు. రాజ్ కోట్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుంది అన్న కారణంతో దుబాయ్ లోనే స్పిన్ పిచ్ ను రెడీ చేయించుకుని ప్రాక్టీస్ చేయనుంది పర్యటక టీమ్. మరి సిరీస్ మధ్యలో ఇంగ్లాండ్ టీమ్ దుబాయ్ కు వెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: స్టార్ ఆల్ రౌండర్ ను తుపాకీతో బెదిరించిన దుండగులు.. ఆ తర్వాత ఏమైందంటే?