iDreamPost

వామ్మో.. వాషింగ్ మిషన్‌లో భారీగా బయటపడ్డ నోట్ల కట్టలు!

Enforcement Directorate: అక్రమంగా సంపాదించిన నల్ల ధనాన్ని కొంతమంది బడా బాబులు ఐటీ అధికారులకు కనిపించకుండా రహస్య ప్రదేశాల్లో దాచేస్తుంటారు. ఈడీ అధికారులు వాటిని శోధించి వెలికితీస్తారు.

Enforcement Directorate: అక్రమంగా సంపాదించిన నల్ల ధనాన్ని కొంతమంది బడా బాబులు ఐటీ అధికారులకు కనిపించకుండా రహస్య ప్రదేశాల్లో దాచేస్తుంటారు. ఈడీ అధికారులు వాటిని శోధించి వెలికితీస్తారు.

వామ్మో.. వాషింగ్ మిషన్‌లో భారీగా బయటపడ్డ నోట్ల కట్టలు!

డబ్బు సంపాదన కోసం ఎన్నో అక్రమాలు, అన్యాయాలకు తెగబడుతున్నారు. ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. డ్రగ్స, హైటెక్ వ్యభిచారం, కిడ్నాపులు, బ్లాక్ మెయిలింగ్, అక్రమాయుధాలు ఇలా ఎన్నో రకాల దందాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇటీవల దేశంలో వరుసగా భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు బయటపడుతున్న విషయం తెలిసిందే. అధికారుల కళ్లు కప్పి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇటీవల అక్రమార్కులపై ఈడీ కొరడా ఝులిపిస్తుంది. బోగస్ కంపెనీ ఏర్పాటు చేసి కోట్లలో అక్రమంగా డబ్బు సంపాదిస్తున్న కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కోట్ల డబ్బులు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే..

ఇటీవల కొంతమంది పెద్ద మనుషుల ముసుగులో డ్రగ్స్ ఇతర ఇల్లీగల్ దందాలు చేపడ్డున్నారు. మరికొంతమంది బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయాలు మనీ లాండరింగ్ కి పాల్పపడుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయ పన్ను ఎగవేస్తూ కోట్ల రూపాయలు అక్రమంగా దాచుకుంటున్నారు. అలాంటి అక్రమార్కుల పై ఈడీ వరుస దాడులు నిర్వహిస్తూ కోట్ల రూపాయాలను సీజ్ చేస్తుంది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్ట నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఎవరూ ఊహించని విధంగా ఓ వాషింగ్ మెషన్ లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ ఘటనపై ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. క్యాప్రికార్నియన్ షిప్పింగ్ – లాజిస్టిక్స్, దాని అనుబంధ సంస్థలు బోగస్ సరుకు రవణా సేవలు, దిగుమతుల పేరిట షెల్ కంపెనీల సాయంతో సింగపూర్ కు చెందిన రెండు సంస్థలతో రూ.18 వందల కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లు ఈడీ కి పక్కా సమాచారం అందింది.

ఈ నేపథ్యంలోనే దేశంలోని ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, హరియాణాలోని కురుక్షేత్రలో మెరుపు దాడులు చేసిన సమయంలో వాషింగ్ మిషన్‌లో భారీగా కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. రూ.2.54 కోట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే, ఈ కరెన్సీ ఏ ప్రాంతంలో దొరికిందనేది చెప్పలేదు. దీనికి సంబంధించిన ఓ ఫోటో ట్విట్టర్ వేధికగా పోస్ట్ చేశారు. కంపెనీకి సంబంధించిన పలు పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని.. మొత్తం 47 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశామని తెలిపింది. అయితే ఈ సోదాలు ఎప్పుడు? ఎక్కడ? జరిగాయన్న విషయం మాత్రం వెల్లడించలేదు. దేశ వ్యాప్తంగా వాషింగ్ మెషన్ లో కోట్ల బయటపడటం సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి