iDreamPost
android-app
ios-app

ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా.. తెలంగాణకు ఎప్పుడు అంటే..?

తెలంగాణలో 119 సీట్లకు, రాజస్తాన్ లో 200 స్థానాలకు, మధ్యప్రదేశ్ 230 స్థానాలకు, చత్తీస్ గఢ్ 90 స్థానాలకు, మిజోరాంలో 40 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.

తెలంగాణలో 119 సీట్లకు, రాజస్తాన్ లో 200 స్థానాలకు, మధ్యప్రదేశ్ 230 స్థానాలకు, చత్తీస్ గఢ్ 90 స్థానాలకు, మిజోరాంలో 40 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.

ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా.. తెలంగాణకు ఎప్పుడు అంటే..?

ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణలో 119 సీట్లకు, రాజస్తాన్ లో 200 స్థానాలకు, మధ్యప్రదేశ్ 230 స్థానాలకు, చత్తీస్ గఢ్ 90 స్థానాలకు, మిజోరాంలో 40 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవి 2024లో జరిగే సార్వ్రతిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ లాంటివి. 40 రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించామని సీఈసీ అన్నారు. అలాగే ఈ సారి మహిళా ఓటర్లు పెరిగారని తెలిపారు. ఈ ఎన్నికల్లో వృద్ధులకు ఇంట్లో ఉండే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సీఈసీ ప్రకటించారు.

తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ తెలిపారు. వీరిలో 1.58 కోట్ల మంది పురుషులు ఉండగా, మహిళా ఓటర్లు 1.58 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి 998: 1000గా ఉంది. కొత్తగా 17.01 లక్షల మంది ఓటు హక్కును పొందారు. అలాగే 6.10 లక్షల మంది ఓట్లను తొలగించామన్నారు. తెలంగాణలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగ్గకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిజోరాంలో నవంబర్ 7న, చత్తీస్ గఢ్ రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్ – నవంబర్ 17న, రాజస్థాన్- 23 నవంబర్, తెలంగాణ- 30 నవంబర్, గెజిట్ నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుందని  పేర్కొన్నారు.