iDreamPost

టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే?

పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. రిజల్ట్స్ తేదీని ప్రకటించింది విద్యాశాఖ. టెన్త్ ఫలితాలు ఎప్పుడు విడుదల కానున్నాయంటే?

ప్రతి విద్యార్థి జీవితానికి టర్నింగ్ పాయింట్ లా భావించే పదో తరగతి ఎంతో కీలకం. టెన్త్ లో చూపిన ప్రతిభ విద్యార్థి భవిష్యత్తుకు, పై చదువులు చదివేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్లనే అటు ఉపాధ్యాయులు, ఇటు పేరెంట్స్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరీక్షలకు సన్నద్ధం చేస్తుంటారు. ఇక ఈ సంవత్సరం కూడా పదో తరగతి పరీక్షలు ముగిశాయి. లక్షలాది మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షలకు అధికారులు పకడ్భందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షరాసిన విద్యార్ధులందూ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని పదో తరగతి విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్తను అందించింది. టెన్త్ ఫలితాల డేట్ ను ప్రకటించింది. ఏపీలో టెన్త్ ఫలితాలు ఏప్రిల్ 22 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. కాగా ఏపీలో మార్చి18 నుంచి మార్చి 30 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగాయి. మొత్తం 6,30,633 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థుల్లో కాస్త టెన్షన్ వాతావరణం ఉంటుందని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి