iDreamPost

వచ్చే విద్యా సంవత్సర ప్రారంభానికి విద్యాశాఖ ప్రతిష్ఠాత్మక “బ్రిడ్జి కోర్సు” వాయిదా???

వచ్చే విద్యా సంవత్సర ప్రారంభానికి విద్యాశాఖ ప్రతిష్ఠాత్మక “బ్రిడ్జి కోర్సు” వాయిదా???

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థులందరినీ ఆంగ్ల మాధ్యమానికి సంసిద్ధులను చేయడం కోసం ప్రారంభించిన “వారధి” కార్యక్రమంనకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.ఈ నెల 16వ తేదీన విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించడానికి బేస్ లైన్ టెస్ట్ (వారధి ప్రారంభం పరీక్ష) ప్రైవేట్ పాఠశాలలు మినహా అన్ని రకాల యాజమాన్య ప్రాథమిక పాఠశాలలో నిర్వహించడం జరిగింది. వారధి ప్రారంభం పరీక్షలో తెలుగు,గణితంలో 8 మార్కుల కన్నా తక్కువ పొందినవారు ఒకటో స్థాయి, తెలుగు గణితంలో 8 కన్నా ఎక్కువ, ఆంగ్లంలో 10 కన్నా ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులు రెండో స్థాయిలో ఉన్న విద్యార్థులుగా నిర్ధారించారు.

విద్యార్థుల స్థాయిలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ(SCERT) ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ 45 రోజుల బ్రిడ్జి కోర్సుకు ప్రణాళికలు సిద్ధంచేసి మార్చి 17 నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించింది. కానీ వారధి కార్యక్రమమును ప్రారంభించిన రెండు రోజులకే కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు మార్చి 19 నుండి మార్చి 31 వరకు సెలవులు ప్రకటించడంతో బ్రిడ్జి కోర్సుకు అంతరాయం ఏర్పడింది.

ఆంగ్ల మాధ్యమ “వారధి” పోగ్రామ్ లో దాదాపు పదిహేను రోజుల ప్రణాళిక ఆగిపోయి విద్యార్థులకు నష్టం కలుగుతుంది.దీంతో వారధి కార్యక్రమమును రీ షెడ్యూల్ చేస్తూ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో జూన్ 12 నుంచి జూలై 31 వరకు 45 రోజుల పాటు బ్రిడ్జ్ కోర్సును నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు విద్యా శాఖ వర్గాల నుండి సమాచారం లభిస్తుంది.ఈలోగా విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సుకై SCERT,ఏపీ వారు రూపొందించిన వర్క్ బుక్ లను కూడా విద్యార్థులందరికీ విద్యాశాఖ అందించనుంది.బ్రిడ్జి కోర్స్ అనంతరం ఆగస్టు 1 నుంచి పాఠ్య పుస్తక బోధన మొదలు పెట్టేలా ప్రణాళికలు రాష్ట్ర విద్యాశాఖ సిద్ధం చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి