iDreamPost

రాయపాటి పై ఈడీ కొరడా

రాయపాటి పై ఈడీ కొరడా

మాజీ యంపీ రాయపాటి సాంబశివరావు కి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు నిధులు మళ్లించారన్నా ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేపట్టింది. 2013-14 వ సంవత్సరంలో ట్రాన్స్ ట్రాయ్ సంస్థకి చెందిన నిధులను సింగపూర్లోని మరో కంపెనీకి బదిలీ చేశారని అక్కడనుండి రష్యాకి కూడా నిధులు మళ్లించారనే ఆరోపణలతో ఇప్పటికే వివిధ బ్యాంక్ ల నుండి ఋణం తీసుకొని బ్యాంక్ లకు ఉద్దేశపూర్వకంగా పెద్దఎత్తున రుణాలు ఎగ్గొట్టారని వివిధ భ్యాంకులతో కూడిన బ్యాంకుల కన్షార్టియం ఇచ్చిన ఫిర్యాదు పై ట్రాన్స్ ట్రాయ్ సంస్థ పై సిబిఐ కేసు నమోదు చేసింది.

ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ 15 బ్యాంకుల నుండి ఎనిమిది వేల కోట్ల నిధులు తీసుకుంది. కాగా ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ యూనియన్ బ్యాంకు నుండి 250 కోట్ల నిధులు, ఇండియన్ బ్యాంకు నుండి మరో 300 కోట్ల ఋణం తీసుకుని నిధులను పక్కదారి పట్టించి రుణాలను ఎగవేసి ఉద్దేశపూర్వకంగా బ్యాంక్ లను మోసం చేశారని ఇదివరకే సిబిఐ కి ఫిర్యాదులు అందాయి.

కాగా ఈ ఫిర్యాదు పై స్పందించిన సిబిఐ మూడు రోజుల క్రితం రాయపాటి సాంబశివరావుకు సంబందించిన ఇళ్లతో పాటు గుంటూరు, హైదరాబాదు, బెంగుళూరుల్లోని ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి చెందిన పలు కార్యాలయాల తో పాటు అదే సంస్థకు చెందిన మరో డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు సంబంధించిన ఇల్లు కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేసి పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకుంది. సీబీఐ కేసుని ఆధారంగా తీసుకొని ఈడీ మరోకేసు నమోదు చేసే అవకాశం వుంది.

ఇదిలా ఉండగా 2015 జులై 31 న 14 బ్యాంకులతో కూడిన కన్సార్టీయం ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలని చేసిన అభ్యర్ధన ని తోసిపుచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారంపై కుడా సిబిఐ విచారణ జరిగే అవకాశం వుంది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పోలవరం హెడ్ వర్క్స్ పనుల్లో ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి బ్యాంకుల కన్సార్టీయం పేరు మీద కాకుండా వేరే బ్యాంకుల పేరు మీద 2,362 కోట్ల బిల్లులను చెల్లించడం పై సిబిఐ ప్రత్యేక దృష్టి సారించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి