iDreamPost

రూ. 820 కోట్లు కస్టమర్ల ఖాతాల్లోకి.. పొరపాటా.. స్కామా.. ? సీబీఐ దర్యాప్తు

ఒక్కోసారి బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీల్లో పొరపాట్లు జరుగుతుంటాయి. ఒకరి ఖాాతాల్లో డబ్బులు జమ చేయబోయి.. మరొకరి అకౌంట్లలోకి నగదు పడుతుంటాయి. అయితే ఒకరిద్దరు ఖాతాల్లో పొరపాటుగా పడటం గురించి చూశారు. కానీ ఏకంగా 41 వేల మంది ఖాతాల్లోకి..

ఒక్కోసారి బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీల్లో పొరపాట్లు జరుగుతుంటాయి. ఒకరి ఖాాతాల్లో డబ్బులు జమ చేయబోయి.. మరొకరి అకౌంట్లలోకి నగదు పడుతుంటాయి. అయితే ఒకరిద్దరు ఖాతాల్లో పొరపాటుగా పడటం గురించి చూశారు. కానీ ఏకంగా 41 వేల మంది ఖాతాల్లోకి..

రూ. 820 కోట్లు కస్టమర్ల ఖాతాల్లోకి.. పొరపాటా.. స్కామా.. ? సీబీఐ దర్యాప్తు

పొరపాట్లు అన్నది సహజం. మనుషులైనా, వ్యవస్థనైనా, సాంకేతిక పరంగా ఒక్కొక్కసారి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని సార్లు ఈ పొరపాట్ల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆ పొరపాట్లు ఆర్థిక పరమైనవి అయితే.. మరో తలనొప్పి మొదలు. సాధారణంగా ఆర్థిక పరమైన తప్పిదాలను మనం ఎక్కువగా బ్యాంకు లావాదేవీల్లో చూస్తూ ఉంటాం. ఒక్కోసారి సామాన్యుల బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బులు పడిపోతుంటాయి. వేలు, లక్షలు, కోట్లు పడిన ఘటనలు కూడా వెలుగు చూశాయి. వాటిని తిరిగి రికవరీ చేసుకుంటాయి. సాంకేతిక సమస్యల కారణంగా ఇలా జరిగిందని ఆ ఖాతాదారులకు సర్ధి చెబుతుంటాయి. అయితే రూ. 820 కోట్లు బదిలీ అయితే.. ఒకరి ఖాతాల్లోకి కాదు.. ఏకంగా 40 వేలకు పైగా అకౌంట్లలో నగదు జమయ్యాయంటే.. ఏమనాలి..?

అంత డబ్బు.. అనేక మంది కస్టమర్ల ఖాతాల్లోకి పడటంపై దృష్టి సారించింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ). ఇంతకు ఆ బ్యాంకు ఏదంటే.. యూకో బ్యాంక్. నవంబర్ 10 నుండి 13వ తేదీల మధ్య యూకో బ్యాంక్‌కు చెందిన 41 వేల మంది ఖాతాదారుల అకౌంట్లలోకి సుమారు రూ. 820 కోట్లు పొరపాటున బదిలీ అయ్యాయి. బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతోంది సీబీఐ. డబ్బులు జమ అయిన తేదీల్లో కొత్తగా తెరుచుకున్న ఖాతాలపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. అయితే పొరపాటుగా జరిగి ఉంటే.. అవే రోజుల్లో ఇన్ని ఖాతాలు తెరుచుకోవడం .. వాటిల్లో నగదు జమ కావడం ఏంటనీ అనుమానం వ్యక్తం చేస్తుంది. అదేమన్నా స్కామా అనే కోణంలో కూడా విచారిస్తోంది. అయితే జమ అయిన నగదును చాలా మంది విత్ డ్రా చేసుకున్నట్లు గుర్తించింది. అయితే పొరపాటున డబ్బులు పడి.. వాటిని విత్ డ్రా చేసిన వారి వివరాలు సేకరిస్తోంది.

అలాగే దురుద్దేశమేమీ లేకుండా డబ్బులు తీసుకున్న వారు.. తమ దర్యాప్తు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీబీఐ స్పష్టం చేసింది. కుట్రపూరితంగా వ్యవహరించిన వారిపై దృష్టి సారించామని స్పష్టం చేసింది. అలాగే దర్యాప్తు అధికారులమంటూ వస్తున్న వ్యక్తులపై పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఖాతాదారుల్ని మోసగించే అవకాశాలున్నాయని తెలిపింది. కేసుకు సంబంధించి.. వివరాల కోసం సీబీఐ ఏ ఒక్కరికీ ఫోన్ కాల్స్ చేయబోదని, ఒక వేళ ఎవరైనా అలా కాల్ చేస్తే సీబీఐని సంప్రదించాలని సూచించింది. రాజస్తాన్ లో అత్యధికంగా 230 శాఖల పరిధిలో 28వేల అకౌంట్లకు  7.50 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. మొత్తంగా రూ. 760 కోట్లు జమ అయ్యాయి. అలాగే కర్ణాటకలో రూ. 3.40 కోట్లు, బెంగాల్ లో రూ. 2.60 కోట్లు జమ అయ్యాయని తెలిపింది. ఈ కేసులో వివిధ చోట్ల చేపట్టిన సోదాల్లో మొబైల్ ఫోన్లు,ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు, డెబిట్, క్రెడిట్ కార్డు వంటిని సేకరించింది. అయితే బ్యాంకు ఇద్దరు సపోర్టు ఇంజినీర్లు, గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి