Nidhan
ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఇంగ్లండ్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ దెబ్బతో భారత క్రికెట్ బోర్డు తలపట్టుకుంటోంది. ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతోంది.
ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఇంగ్లండ్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ దెబ్బతో భారత క్రికెట్ బోర్డు తలపట్టుకుంటోంది. ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతోంది.
Nidhan
క్రికెట్ అభిమానులకు ఐపీఎల్-2024 మస్తు వినోదాన్ని పంచుతోంది. లీగ్ ఫస్టాఫ్ ఒకెత్తు అనుకుంటే సెకండాఫ్ దాని కంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్‌లతో క్యాష్ రిచ్ లీగ్ అందరి చూపును తన వైపునకు తిప్పుకుంటోంది. స్టేడియాలకు వస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ బౌండరీలు, సిక్సుల వర్షంలో తడిసిముద్దవుతున్నారు. లీగ్ దాదాపు సగానికి పైగా ముగిసింది. అన్ని టీమ్స్ కనీసం 9 మ్యాచ్‌లు ఆడేశాయి. ఇంకో ఐదేసి మ్యాచ్‌లు ఆడితే గ్రూప్ దశ ముగుస్తుంది. ఆ తర్వాత ప్లేఆఫ్స్, అనంతరం జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముగస్తుంది. ఇప్పటిదాకా లీగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన ఐపీఎల్ నిర్వాహకులు.. మిగతా సీజన్ కూడా ఇలాగే పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే వాళ్లకు గట్టి షాక్ తగిలింది.
ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చేసిన పనితో బీసీసీఐ ఇప్పుడు తలపట్టుకుంటోంది. అసలు ఈసీబీ ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.. త్వరలో టీ20 వరల్డ్ కప్-2024 జరగనుంది. మెగా టోర్నీ మొదలవడానికి ఇంకా నెల రోజుల కంటే ఎక్కువ టైమ్ లేదు. దీంతో క్రమంగా ప్రపంచ కప్ సన్నాహకాలపై అన్ని జట్లు ఫోకస్ పెడుతున్నాయి. ఇంగ్లండ్ బోర్డు కూడా ఇదే పనుల్లో ఉంది. ఇవాళ వరల్డ్ కప్ టీమ్‌ను కూడా అనౌన్స్ చేసింది. అయితే ఇంకో కీలక ప్రకటన కూడా చేసింది. ఐపీఎల్లో ఆడుతున్న తమ దేశ ఆటగాళ్లందరూ ప్లేఆఫ్స్‌కు ముందే స్వదేశానికి తిరిగి వచ్చేయాలని ఆదేశించింది. పాకిస్థాన్ జట్టుతో మే 22 నుంచి మొదలయ్యే టీ20 సిరీస్‌లో ప్లేయర్లు అందరూ ఆడాలని తెలిపింది.
పాక్‌తో పొట్టి ఫార్మాట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ ఆటగాళ్లందర్నీ ప్లేఆఫ్స్‌కు ముందే స్వదేశానికి రావాల్సిందిగా ఈసీబీ ఆదేశించింది. దీంతో ఆ సిరీస్‌కు ఎంపికైన కెప్టెన్ జాస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), మొయిన్ అలీ (చెన్నై సూపర్ కింగ్స్), జానీ బెయిర్‌స్టో (పంజాబ్ కింగ్స్), సామ్ కర్రన్ (పంజాబ్ కింగ్స్), విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), లియామ్ లివింగ్స్టన్ (పంజాబ్ కింగ్స్), ఫిల్ సాల్ట్ (కోల్‌కతా నైట్ రైడర్స్), రీస్ టోప్లే (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) మే 22వ తేదీకి ముందే ఇంగ్లండ్‌కు పయనం కానున్నారు. ఈ ఆటగాళ్లంతా వరల్డ్ కప్ స్క్వాడ్‌లో కూడా ఉండటం విశేషం. ఈ వార్తతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు తలపట్టుకుంటున్నాయి. వీళ్లను ఎవరితో భర్తీ చేయాల్నో తెలియక టెన్షన్ పడుతున్నాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో బీసీసీఐకి కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఇంగ్లండ్‌కు పాక్ సిరీస్ ముఖ్యం. ఆ టీమ్ ఆటగాళ్లను స్వదేశానికి వెళ్లకుండా ఆపలేని పరిస్థితి. కాగా, మే 21 నుంచి ఐపీఎల్ ప్లేఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. మరి.. దీన్ని ఫ్రాంచైజీలు, బోర్డు ఎలా పరిష్కరిస్తాయో చూడాలి.
ECB CONFIRMS ENGLAND PLAYERS WONT BE AVAILABLE FOR THE IPL PLAY-OFFS….!!!!! pic.twitter.com/wysje6gkmL
— Johns. (@CricCrazyJohns) April 30, 2024