iDreamPost

మేఘాలయ, తైవాన్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రత నమోదు!

  • Published Dec 24, 2023 | 11:39 AMUpdated Dec 24, 2023 | 11:39 AM

ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. వారం రోజుల క్రితం చైనాలో భూకంప ధాటికి 116 మంది కన్నుమూశారు.

ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. వారం రోజుల క్రితం చైనాలో భూకంప ధాటికి 116 మంది కన్నుమూశారు.

  • Published Dec 24, 2023 | 11:39 AMUpdated Dec 24, 2023 | 11:39 AM
మేఘాలయ, తైవాన్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రత నమోదు!

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరుస భూకంపాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. భారత్, నేపాల్, మలేషియా, చైనా, పాకిస్థాన్, జపాన్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో వరుసగా భూపంకాలు సంభవిస్తున్నాయి. ఈ మద్యనే వాయువ్య చైనాలోని గాన్సూ క్విన్ ఘాయ్ లో భారీభూపంకం సంభవించింది.. రిక్టర్ స్కేల్ పై 6.2గా నమోదు అయ్యింది. ఈ ఘటనలో 116 మంది కన్నుమూసినట్లు సమాచారం. తాజాగా తైవాన్, మేఘాలయలో భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే..

భారత్ లో తరుచూ భూపంపాలు సంభవిస్తున్నాయి. ఆదివారం ఉదయం భూకంపం తీవ్ర ఆందోళన కలిగించింది. తైవాన్, మేఘాలయల ప్రాంతాల్లో భూమి కంపించింది. తైవాన్ దేశంలో తక్కువ జనాబా ఉండే తూర్పు తీరంలో ఆదివారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కౌంటీలోని గ్రామీణ ప్రాంతాల్లోని తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే బయటకు పరుగులు తీశారు.

తైవాన్ రాజధాని తైపీలో మాత్రం ఎలాంటి భూకంపం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే శనివారం మేఘాలయ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఇక్కడ వెస్ట్ గారోహిల్స్ రీజియన్ లో ఒక్కసారే భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు.. వెంటనే ఇళ్లు వదిలి బయటకు వచ్చారు. రిక్టర్ స్కేల్ పై 3.5 గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి