iDreamPost

ఈగల్ నిర్మాతలు పట్టుదల! నష్టం మాత్రం రవితేజకే?

రవితేజ నటించిన ఈగల్‌ సినిమాను సంక్రాంతికి బరిలో దించడానికి నిర్మాతలు సన్నద్ధం చేస్తున్నారు. అయితే, ఇది రవితేజ నష్టం తెచ్చిపెట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

రవితేజ నటించిన ఈగల్‌ సినిమాను సంక్రాంతికి బరిలో దించడానికి నిర్మాతలు సన్నద్ధం చేస్తున్నారు. అయితే, ఇది రవితేజ నష్టం తెచ్చిపెట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈగల్ నిర్మాతలు పట్టుదల! నష్టం మాత్రం రవితేజకే?

మాస్‌ మహారాజా రవితేజ తాజాగా ‘‘ టైగర్‌ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ చిత్రం అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. అన్ని భాషల్లో సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే, కలెక్షన్ల పరంగా మూవీకి ఆశించిన స్థాయి రెస్పాన్స్‌ రాలేదు. కేవలం 5.20 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా టైగర్‌ నాగేశ్వరరావు.. ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్లు మాత్రమే కలెక్ట్‌ చేసింది.

ఈ నేపథ్యంలోనే రవితేజ ‘ఈగల్‌’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. ఈగల్‌ సినిమాతో నెంబర్‌ రేసులో ముందుకు దూసుకుపోవాలని భావిస్తున్నారట. అయితే, ఆయన ఆశలు అడియాశలు అయ్యేలా ఉన్నాయి. ఇందుకు ఈగల్‌ చిత్ర నిర్మాతలే కారణం అవుతున్నారు. ఇంతకీ సంగతేంటంటే.. ఈగల్‌ సినిమా వచ్చే సంవతర్సం జనవరి 13న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంక్రాంతి కాబట్టి.. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా విడుదలకు సిద్ధం చేసుకుంటున్నాయి.

మహేష్‌ బాబు ‘గుంటూరు కారం’, నాగార్జున ‘నా సామి రంగా’, వెంకటేష్‌ సైంధవ్‌, ప్యాన్‌ ఇండియా చిత్రం హనుమాన్‌ సంక్రాంతికి విడుదలవుతున్నాయి. ఈ చిత్రాలపై మొదటి నుంచి బజ్‌ ఉంది. వీటితో పోటీగా ఈగల్‌ నిలబడ్డం అన్నది కలెక్షన్లకు చిల్లి పెట్టుకోవటమే. ఈగల్‌ మాస్‌ మసాలా సినిమా అయినప్పటికీ నష్టం తప్పదు. ఈ విషయం తెలిసి కూడా చిత్ర నిర్మాణ సంస్థ వెనక్కు తగ్గటం లేదంట. సంక్రాంతికి బరిలో ఉండాలని భావిస్తోందట.

రవితేజకు నష్టం తప్పదు!

రవితేజ గత కొంతకాలంగా నెంబర్‌ రేసులో వెనకబడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్‌ డే కలెక్షన్ల పరంగా రవితేజ రేసులోనే లేరు. టైగర్‌ నాగేశ్వరరావు ఇందుకు తాజా ఉదాహరణ. ఈగల్‌ చిత్రంతో రేసులో ముందుకు వెళ్లాలని భావిస్తున్న రవితేజకు.. ఈగల్‌ నిర్మాతల నిర్ణయం అడ్డుకట్టగా మారింది. సంక్రాంతికి గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్‌, హనుమాన్‌ సినిమాలు బరిలో ఉన్నాయి కాబట్టి.. ఈగల్‌కు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకటం కష్టం. దొరికిన తక్కువ థియేటర్లలో చిత్రాన్ని రిలీజ్‌ చేస్తే.. అది ఫస్ట్‌ డే కలెక్షన్లపై ప్రభావం చూపుతుంది. తర్వాత కలెక్షన్ల విషయంలో చిత్రం పుంజుకున్నా లాభం ఏమీ ఉండదు. ఫస్ట్‌ డే కలెక్షన్ల విషయంలో రవితేజకు మళ్లీ దెబ్బపడుతుంది. అది అటు తిరిగి, ఇటు తిరిగి రవితేజకు నష్టం తెచ్చిపెడుతుంది. మరి, ఈగల్‌ నిర్మాతల నిర్ణయం రవితేజకు నష్టం తెచ్చిపెడుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి