iDreamPost
android-app
ios-app

ప్రభాస్ పాన్ వరల్డ్ సినిమాలో దుల్కర్ సల్మాన్!

  • Author ajaykrishna Published - 11:37 AM, Wed - 16 August 23
  • Author ajaykrishna Published - 11:37 AM, Wed - 16 August 23
ప్రభాస్ పాన్ వరల్డ్ సినిమాలో దుల్కర్ సల్మాన్!

డార్లింగ్ ప్రభాస్.. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓవైపు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్.. మరోవైపు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ‘కల్కి 2898 AD’ సినిమాలను ఒకదాని వెనుక మరోటి సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే సలార్ షూటింగ్ ముగించుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా సలార్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమా గ్లింప్స్ హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి చేర్చింది. అయితే.. సలార్ తర్వాత వరల్డ్ వైడ్ బజ్ క్రియేట్ చేసిన మూవీ కల్కి. ఈ సినిమా ఇండియన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతోంది.

ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న కల్కి మూవీ.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా.. ఇటీవల విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్.. ఒక్కసారిగా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. అదిగాక ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే, దిశా పటాని లాంటి బాలీవుడ్ బ్యూటీలు నటిస్తున్నారు. మరోవైపు లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఇలాంటి మెయిన్ కాస్ట్ ఉన్నాక సినిమాకు హైప్ లేకుండా పోతుందా? ఇలాంటి తరుణంలో సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. కల్కి సినిమాలో మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ కీలకపాత్రలో నటించనున్నాడట. మహానటి, సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత తెలుగులో దుల్కర్ కి సూపర్ క్రేజ్ ఏర్పడింది. పైగా చేసిన రెండు సినిమాలు కూడా వైజయంతి బ్యానర్ లో నిర్మించినవే కావడం విశేషం. ఇప్పుడు మరోసారి వైజయంతి వారు దుల్కర్ ని కల్కిలో ఓ చిన్న పాత్ర కోసం సంప్రదించారట. ఆ పాత్ర పది నిముషాల నిడివి కలిగి ఉంటుందని.. కానీ సినిమాలో కీలకమైన దశలో ఎంటర్ అవుతుందని అంటున్నారు. కాగా.. అసలే మైథాలజీకి.. సైన్స్ ని జోడించిన ఈ సినిమాలో దుల్కర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మరి. దుల్కర్ కూడా రోల్ ఓకే చేశాడని టాక్. దీనిపై అధికారిక ప్రకటన బయటికి రావాల్సి ఉంది. మరోవైపు దుల్కర్ కి ఆల్రెడీ వైజయంతి బ్యానర్ లో మరో సినిమా ఓకే అయ్యిందని అంటున్నారు. మరి కల్కి మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş