iDreamPost

TS:సిగరెట్‌ పెట్టేల్లో డ్రగ్స్‌..! కొత్త దందాకు తెరలేపిన కేటుగాళ్లు

  • Published Feb 03, 2024 | 12:01 PMUpdated Feb 03, 2024 | 12:01 PM

ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కు పాదం మోపుతోంది. దీంతో మత్తుకు బానిసైన యువత ఎక్కడ కూడా గంజాయి, డ్రగ్స్ వంటివి దొరకడం కష్టంగా మారడంతో కొత్త తరహా మత్తకు బానీసలవుతున్నారు. ఆఖరికి వాటిని కూడా వాదలడం లేదు.

ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కు పాదం మోపుతోంది. దీంతో మత్తుకు బానిసైన యువత ఎక్కడ కూడా గంజాయి, డ్రగ్స్ వంటివి దొరకడం కష్టంగా మారడంతో కొత్త తరహా మత్తకు బానీసలవుతున్నారు. ఆఖరికి వాటిని కూడా వాదలడం లేదు.

  • Published Feb 03, 2024 | 12:01 PMUpdated Feb 03, 2024 | 12:01 PM
TS:సిగరెట్‌ పెట్టేల్లో డ్రగ్స్‌..! కొత్త దందాకు తెరలేపిన కేటుగాళ్లు

రాష్ట్రంలో రోజురోజుకి డ్రగ్స్ , గంజాయి అనేది చాపకింద నీరులా విస్తరిస్తోంది. మారుమూల పల్లెల నుంచి పట్టణాల దాకా ప్రతిఒక్కరు ఈ మత్తు పదర్థాలకు బానిసలు అవుతున్నారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఊబిలో ఎక్కువగా యువత కూరుకుపోతు.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వీటిపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న అడుగడుకి ఈ డ్రగ్స్ అక్రమణ దందా అనేది విస్తరించిపోతుంది. విదేశీయుల నుంచి రాష్ట్రంలోని విద్యార్థుల దాకా ఎందరో ఈ మత్తు పదర్థాలను రవాణా చేయడం, వినియోగించడం, వంటివి చేస్తు పట్టుబడుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రల్లో ఈ డ్రగ్స్‌పై ప్రభుత్వం యుద్ధం ప్రకటించటంతో నిషా కోసం యువత కొత్త దారులు వెతుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. మత్తునిచ్చే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ను సరికొత్తగా వినియోగిస్తున్నారు. తాజాగా ఇలాంటి తరహాలో విక్రయిస్తున్న ఓ ముఠాను తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కు పాదం మోపుతోంది. దీంతో మత్తుకు బానిసైన యువత ఎక్కడ కూడా గంజాయి, డ్రగ్స్ వంటివి దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే.. కొత్త తరహా మత్తుకు బానీసలవుతున్నారు. దీనినే అదనుగా తీసుకున్న కొన్ని ముఠాలు నొప్పి నివారణ, మానసిక వ్యాధుల చికిత్సలో వాడే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను అడ్డదారుల్లో అమ్ముతున్నారు. తాజాగా రాష్ట్రంలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా.. స్పాస్మో ప్రాక్సివోన్ ప్లస్, అల్ట్రా కింగ్ , ట్రామాడెక్స్ ఇంజెక్షన్లు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను నల్గొండ వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారు నల్లగొండకు చెందిన జబీయుల్లా, ఎండీ సల్మాన్ లు గా గుర్తించారు.

కాగా, వీరు గత కొంతకాలంగా మత్తు పదర్థాలకు బానిసలయ్యారు. దీంతో వైట్ నర్, గంజాయిని ఎక్కువగా పీల్చేవారు. కానీ ఇప్పుడు గంజాయి దొరకడం కష్టంగా మారడంతో ఈ తరహా ప్లాన్ చేశారు. అయితే వీరు శివాజీ నగర్ లోని న్యూ హెల్త్ కేర్ ఫార్మసీకి చెందిన తౌడోజు నరేష్ నుంచి ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ టాబ్లెట్, ఇంజెక్షన్‌లను కొనుగోలు చేసేవారు. అలాగే ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఈ టాబ్లెట్స్, ఇంజక్షన్లను సిగరెట్ పెట్టెల్లో పెట్టి బయట వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

పైగా ఈ టాబ్లెట్స్ ను ఇంజక్షన్ లను గత మూడేళ్లుగా ఎక్కువ మోతాదులో సేవిస్తున్నామని చెప్పారు. దీంతో పోలీసులు ఈ ముగ్గురని అరెస్టు చేశారు. అలాగే వారి దగ్గర ఉండే 4032 స్పాస్మో ప్రాక్సివోన్ ప్లస్ టాబ్లెట్స్, 585 అల్ట్రా కింగ్ టాబ్లెట్స్, 300 ట్రామాడెక్స్ ఇంజెక్షన్లు, టాబ్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మెడికల్ షాప్ యజమానులు మత్తు కలిగించే టాబ్లెట్స్, ఇంజెక్షన్‌లు విక్రయిస్తే కఠిన చర్యలతో పాటూ పి.డి యక్ట్స్ కింద కేసు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. కాగా మాదకద్రవ్యాల అక్రమలను సమాచారం ఇచ్చే వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. మరి, సిగిరెట్ పెట్టెలో మత్తు టాబ్లెట్స్, ఇంజక్షన్ల విక్రయించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి