iDreamPost

యువతి దారుణ నిర్ణయం.. కన్న వాళ్లకి కూడా చెప్పకుండా..

Nalgonda District: ఈ రోజుల్లో యువత ఆలోచనా తీరు, నిర్ణయాలు తీసుకునే విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎవరినీ కూడా సరిగ్గా అంచనా వేసే పరిస్థితి కనిపించడం లేదు. వాళ్లు తీసుకునే నిర్ణయాలు ఊహకు కూడా అందడం లేదు.

Nalgonda District: ఈ రోజుల్లో యువత ఆలోచనా తీరు, నిర్ణయాలు తీసుకునే విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎవరినీ కూడా సరిగ్గా అంచనా వేసే పరిస్థితి కనిపించడం లేదు. వాళ్లు తీసుకునే నిర్ణయాలు ఊహకు కూడా అందడం లేదు.

యువతి దారుణ నిర్ణయం.. కన్న వాళ్లకి కూడా చెప్పకుండా..

ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా యువత తీసుకుంటున్న దారుణమైన నిర్ణయాల గురించే వింటూ ఉంటున్నాం. కారణం ఏదైనా, సమస్య ఏదొచ్చినా, పరీక్షల్లో తప్పినా, ఆరోగ్యం బాగోకపోయినా కూడా చావే శరణ్యంగా భావిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుని ఈ బాధల నుంచి బయటపడచ్చు అనే మూర్ఖపు నిర్ణయానికి వచ్చేస్తున్నారు. కానీ, ఆ తర్వాత కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? కన్నందుకు వారు ఎంత క్షోభ పడతారు? వారిని ఇలా అర్థాంతరంగా వదిలేసి వెళ్లిపోతే ఎలా? అనే చిన్న ప్రశ్నలు కూడా వేసుకోకుండా తోచిన నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక యువతి కూడా అలాంటి ఒక నిర్ణయమే తీసుకుంది.

నల్గొండ జిల్లా పర్వతగిరి గ్రామంలో మంగళవారం సాయంత్రం ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పిండింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం. ఆత్మహత్యకు పాల్పడిన యువతి పేరు చనగాని కావ్య(20). మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోదరుడు నవీన్ ఇంటికి వచ్చి చూసేసరికి కావ్య ఫ్యానుకు వేలాడుతూ కనిపించిందింది. వెంటనే కావ్యను కిందకు దింపి నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కావ్యను పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు. కన్నకూతురు ఇలా చేసిందేంటంటూ కన్నీరుమున్నీరయ్యారు. కావ్య తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసులో కావ్య రెండేళ్లుగా ఫిట్స్ తో బాధపడుతున్నట్లు చెప్తున్నారు. ఆ ఫిట్స్ వల్ల ఆమె మానసికంగా కుంగి పోయిందనే వాదన ఉంది. ఆ ఫిట్స్ కారణంగానే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అసలు విషయాలు ఏంటి అనేది త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఫిట్స్ కారణంగానే ఉరి వేసుకుని ఉంటదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కావ్య అనే కాదు.. ప్రతి చిన్న విషయానికి ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత విద్యార్థులు పాస్ కాలేదని ఆత్మహత్యలు చేసుకోవడం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. అవసరమైతే కౌన్సిలింగ్ ఇప్పించాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి