iDreamPost

నకిలీ కరొనా వెబ్ సైట్ లు ఓపెన్ చేయొద్దు

నకిలీ కరొనా వెబ్ సైట్ లు ఓపెన్ చేయొద్దు

కరొనా వైరస్ (కొవిడ్-19) మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ఈ వైరస్ బారిన పడకుండా ఉండటం ఎలాగో తెలుసుకోవాలని యువత పెద్ద ఎత్తున గూగుల్ ని ఆశ్రయిస్తున్నారు.గూగుల్ లో ఉన్న ఆర్టికల్స్ కోసం నెటిజన్లు పెద్ద ఎత్తున వెతుకుతున్నారు. ఈ వైరస్ పట్ల ప్రజల్లో ఆసక్తి పెరగడంతో కొందరు సైబర్ నేరగాళ్లకు దాన్ని ఒక అవకాశంగా మల్చుకోవడంతో కొందరు అమాయకులు ఈ సైబర్ నేరగాళ్ల వల లో పడుతున్నారు.

కరొనా వైరస్ పేరుతో నకిలీ వెబ్ సైట్లను సృష్టించిన కొందరు సైబర్ నేరగాళ్లు అటువంటి సైట్లు ఓపెన్ చేసినవారి వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా సేకరించి సదరు వ్యక్తుల బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నట్టు ఇటీవల కాలంలో తమకు ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. శుక్రవారం మీడియా సామావేశాన్ని ఎర్పాటు చేసిన ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల కాలంలో ఇలా పదుల సంఖ్యలో నకిలీ కరొనా వైరస్ వెబ్ సైట్లు పుట్టుకొచ్చాయని, వాటిని క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారని తెలిపారు.

– coronavirursstatus(.)space
– coro navirus(.)zone
– Coronavirus-realtime(.com)
– bgvfr.coronavirusaware(.)xyz

ఇలాంటివి చాలా డెంజరస్ డొమైన్స్ అని, వీటిని ఎవ్వరూ క్లిక్ చెయొద్దని ఎస్పీ ఫకీరప్ప ప్రజలను కోరాడు. సెల్ ఫోన్ లో కుడా నకిలీ కరొనా వైరస్ అలర్ట్ వెబ్ సైట్ల సమాచారం ఇబ్బడిముబ్బడిగా షేర్ చేస్తున్నారని, అటువంటి వాటిని ఓపెన్ చెయొద్దని ఆయన తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే సైబర్ పోలీసులకు గానీ, సైబర్ మిత్ర వాట్సప్ నెంబర్ 9121211100 కు ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి