iDreamPost

గూగుల్ షాకింగ్ ప్రకటన.. పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు! అంతా ఇంటికే!

  • Published Apr 18, 2024 | 2:29 PMUpdated Apr 18, 2024 | 2:29 PM

Google Layoffs: దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. వేల మంది ఉద్యోగులను తొొలగించేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

Google Layoffs: దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. వేల మంది ఉద్యోగులను తొొలగించేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

  • Published Apr 18, 2024 | 2:29 PMUpdated Apr 18, 2024 | 2:29 PM
గూగుల్ షాకింగ్ ప్రకటన.. పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు! అంతా ఇంటికే!

ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొని ఉంది. దాంతో కంపెనీలన్ని ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. అది కూడా వందలు, వేలల్లో. దిగ్గజ టెక్ కంపెనీలన్నింటిలో ఇదే పంథా నడుస్తోంది. ఇక తాజాగా ఆ జాబితాలోకి గూగుల్ కూడా చేరింది. ఈ ఏడాది కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దాంతో ఐటీ రంగం మళ్లీ షేక్ అవుతోంది. ఆ వివరాలు..

దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ మరోసారి ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్ధం చేసింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)ఉద్యోగులకు రాసిన అంతర్గత లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని లేఖలో వివరించారు. ’’ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వల్ల టెక్ రంగంలో ఎన్నో మార్పులొస్తున్నాయి. మనకు ఉన్న కోట్లాది మంది వినియోగదారులకు ఉత్తమమైన ఉత్పత్తుతులను అందించడానికి ఇంది ఎంతో మంచి అవకాశం‘‘ అన్నారు.

‘‘అయితే ఈ క్రమంలో కంపెనీ కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. మన ప్రాధాన్యాలు ఏంటో గుర్తించి.. వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దానివల్లే.. నైపుణ్యం ఉన్న కొందరు సభ్యుల్ని బయటకు పంపాల్సి వస్తోంది. ఇది అత్యంత బాధకరమైన విషయం అని మాకు తెలుసు‘‘ అంటూ ఉద్యోగులకు రాసిన లేఖలో సీఎఫ్ఓ పేర్కొన్నారు.

అయితే ఉద్యోగుల తొలగింపు గురించి గతంలోనే కంపెనీ ప్రకటించింది. 2024లో మరికొంత మంది ఉద్యోగుల్ని తొలగిస్తామని కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. అప్పుడు కూడా వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించగా.. ఈ సారి ఆ సంఖ్య ఎంత అనే దానిపై క్లారిటీ లేదు. అయితే అది వేలల్లో ఉండవచ్చని టెక్ వర్గాల్లో వినిపిస్తోంది. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కొంత మంది ఉద్యోగుల్ని గూగుల్ ఇతర విధుల్లోకి కూడా బదిలీ చేస్తోంది.

భారత్‌లో కార్యకలాపాల్ని విస్తరిస్తున్నగూగుల్ అందుకోసం కొందరిని ఇక్కడకు కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎంత మందిని తొలగిస్తున్నారు.. ఎందరిని బదిలీ చేస్తున్నారనే విషయం గురించి కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

గతకొంత కాలంగా.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టెక్ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. యాపిల్, టెస్లా, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ిదే బాటలో పయనిస్తూ.. తమ సిబ్బందిని తగ్గిస్తున్నాయి. 2024లో వీటిల్లో ఇప్పటి వరకు 58 వేల మంది వరకు ఉద్వాసనకు గురైనట్లు పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి