iDreamPost
android-app
ios-app

Thriller Movie In OTT: ఒకే పోలికలతో ఇద్దరు! లవర్ మాత్రం ఒక్కటే! OTTలో పిచ్చెక్కించే మూవీ!

  • Published May 20, 2024 | 6:36 PMUpdated May 20, 2024 | 6:36 PM

OTT Movie Suggestion: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చూసేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఈ సినిమాను ఇప్పటివరకు చాలా మంది చూసి ఉండరు. ఇలాంటి ఓ సినిమా కూడా ఉందా అని అనిపించే సినిమా ఇది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Movie Suggestion: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చూసేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఈ సినిమాను ఇప్పటివరకు చాలా మంది చూసి ఉండరు. ఇలాంటి ఓ సినిమా కూడా ఉందా అని అనిపించే సినిమా ఇది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published May 20, 2024 | 6:36 PMUpdated May 20, 2024 | 6:36 PM
Thriller Movie In OTT: ఒకే పోలికలతో ఇద్దరు! లవర్ మాత్రం ఒక్కటే! OTTలో  పిచ్చెక్కించే మూవీ!

ఓటీటీ మూవీ లవర్స్ అంతా కూడా చూసేది కేవలం కొన్ని రకాల జోనర్స్ వైపే .. అయితే రొమాన్స్ లేదా థ్రిల్లర్ మూవీస్. ఇక థ్రిల్లర్ సినిమాలలో అనేక రకాలు ఉంటాయి… సస్పెన్స్ థ్రిల్లర్స్, సైకో థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్ ఇలా డిఫ్ఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక ఈ జోనర్ లో వచ్చిన సినిమాలన్నిటిని కూడా ప్రేక్షకులు మిస్ అవ్వకుండా చూస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. ఇలాంటి ఓ సినిమా కూడా ఉందా అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. పైగా ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించిన వ్యక్తి ఎవరో తెలిస్తే.. ఇన్ని రోజులు ఈ సినిమాను ఎలా మిస్ అయ్యాం అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా ఏంటో తెలుసుకునేకంటే ముందు.. ఈ సినిమా కథేంటో చూసేద్దాం.. ఈ సినిమా అంతా కూడా హరి నారాయణ్, రవి నారాయణ్ అనే ఇద్దరి కవలల చుట్టూ తిరుగుతుంది. వారిద్దరూ ప్రవర్తించే తీరు చాలా భిన్నంగా ఉంటుంది. హరి ఓ డాక్టర్.. అయితే హాస్పిటల్ కు వెళ్లే దారిలో ఓ రోజు హరి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో చనిపోతాడు. అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అని కేసును సాల్వ్ చేయడానికి ఫహద్ రంగంలోకి దిగుతాడు. ఈ ప్రాసెస్ లో అతనికి అనుకోని ఎన్నో సంఘటనలు ఎదురౌతాయి. మెల్లగా రవి హరి లా మారిపోతూ ఉంటాడు. రవి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో ఎవరికీ అర్ధం కాదు. అసలు ఆ తర్వాత ఏం జరిగింది ? చనిపోయింది రవి నా హరి నా ? ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది ? ఈ కేసు ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి ? చివరికి ఈ కేసు ఎలా సాల్వ్ చేశారు ? ఇవన్నీ తెలియాలంటే “వన్ బై టు” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్స్ట్ లో సస్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సినిమా మధ్య మధ్యలో కాస్త కంఫ్యూజింగ్ గా అనిపించినా కూడా.. సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ నచ్చే వారికి మాత్రం ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. ఈ కేసును సాల్వ్ చేసే విధానం అంతా కూడా చూసేటప్పుడు ప్రేక్షకులను ఎండ్ వరకు ఎంగేజింగ్ గా ఉంచుతుంది. ఇప్పటివరకు వచ్చిన థ్రిల్లర్ సినిమాలలో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పి తీరాలి. మరి ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి