iDreamPost

సూపర్ స్టార్ తో ఉన్న ఈ పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు ఓ స్టార్ హీరో

  • Author Soma Sekhar Published - 04:24 PM, Mon - 18 September 23
  • Author Soma Sekhar Published - 04:24 PM, Mon - 18 September 23
సూపర్ స్టార్ తో ఉన్న ఈ పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు ఓ స్టార్ హీరో

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన దగ్గర్నించి హీరోల చిన్నప్పటి ఫొటోలు, హీరోయిన్ ల చిన్నప్పటి ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. ఇక ఒకప్పటి స్టార్ హీరోలతో కలిసి నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు బిగ్ స్టార్స్ గా వెలుగొందుతున్న విషయం తెలియనిది కాదు.. అలా బిగ్ స్టార్స్ చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఫొటోనే నెట్టింట వైరల్ గా మారింది. సూపర్ స్టార్ రజినీ కాంత్ తో కలిసి ఉన్న ఈ పిల్లాడు ఇప్పుడు ఓ స్టార్ హీరో.. అదీకాక అమ్మాయిల కలల రాకుమారుడు కూడా. మరి ఈ కుర్రాడిని మీరు గుర్తుపట్టారా?

పై ఫొటోలో సూపర్ స్టార్ రజినీ కాంత్ తో కలిసి ఉన్న పిల్లాడిని మీరు గుర్తుపట్టారా? అతడు బాలీవుడ్ లో స్టార్ హీరో. అతడి తండ్రి కూడా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. ఇప్పటికైనా మీకు గుర్తొచ్చాడా? ఆ పిల్లాడు ఎవరో? అయితే మీకు మరో క్లూ ఇస్తాను. అతడు బాలీవుడ్ స్టార్ హీరో, కండలు తిరిగిన గ్రీక్ బాడీ అతడిది. అతడు మోస్ట్ ఆసియా హ్యాండ్సమ్ గా నిలిచాడు కూడా. అమ్మాయిల కలల రాకుమారుడు. ఇన్ని క్లూలు ఇచ్చినా మీకు అతడెవరో స్ట్రైక్ అవ్వట్లేదా? సూపర్ స్టార్ తో ఉన్న ఈ బుడతడు మరెవరో కాదు.. బాలీవుడ్ బిగ్ స్టార్ హృతిక్ రోషన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా సూపర్ స్టార్ రజినీతో కలిసి ఓ సినిమాలో నటించాడు హృతిక్. ఆ సినిమాలోని స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇక రజినీ తాజాగా జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ దాదాపు రూ. 700 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. తన నెక్ట్స్ మూవీ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయనున్నాడు తలైవా. ఇక హృతిక్ ప్రస్తుతం వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటుగా క్రిష్ సినిమాకు సీక్వెల్ గా క్రిష్ 4 చేయడానికి ప్రత్నాలు చేస్తున్నాడు హృతిక్. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన విషయాలపై క్లారిటీ రానుంది. మరి మీలో ఎంతమంది ఫొటో చూడగానే ఆ పిల్లాడు హృతిక్ అని గుర్తుపట్టారో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan)

 

View this post on Instagram

 

A post shared by Rajinikanth Fans🤘 (@rajni_fansclub)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి