iDreamPost

ఎన్టీఆర్ పక్కన ఉన్న ఈ హీరోని గుర్తు పట్టారా..?

సినిమా అంటే చాలా మందికి పిచ్చి, ఫ్యాషన్. ఒక్క అవకాశం వస్తే చాలు.. తనను తాను నిరూపించుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అయితే సెలబ్రిటీ వారసులకు త్వరగా అవకాశం దక్కుతుంది కానీ.. సాామాన్యులు కష్టపడాల్సిందే. హీరోగా నిలబడాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. దీనికి కాస్త లక్ కూడా అవసరం.

సినిమా అంటే చాలా మందికి పిచ్చి, ఫ్యాషన్. ఒక్క అవకాశం వస్తే చాలు.. తనను తాను నిరూపించుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అయితే సెలబ్రిటీ వారసులకు త్వరగా అవకాశం దక్కుతుంది కానీ.. సాామాన్యులు కష్టపడాల్సిందే. హీరోగా నిలబడాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. దీనికి కాస్త లక్ కూడా అవసరం.

ఎన్టీఆర్ పక్కన ఉన్న ఈ హీరోని గుర్తు పట్టారా..?

బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అనేక మంది హీరోలు అలరిస్తూనే ఉన్నారు. అయితే సక్సెస్ అయ్యేది మాత్రం కొంత మందే.  అదృష్ట దేవత  కొంత మందిని మాత్రమే వరిస్తుంది. హీరో అవుదామని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్క సినిమాతో ఇంటికి వెళ్లిపోయినవారున్నారు. నేరుగా ఇండస్ట్రీకి వచ్చినా, వారసులైనా సరే.. నచ్చకపోతే సాగనంపేస్తారు ప్రేక్షకులు. మరికొంత మంది హీరోలు పది, ఇరవై సినిమాలు చేస్తూ ఫేడ్ అవుతూ ఉంటారు. అయితే చాలా మంది యంగ్ వయస్సులోనే నటులుగా ఎంట్రీ ఇచ్చారు.. చిన్న చిన్న క్యారెక్టర్‌లో మెరుస్తూ హీరోలు అవుతుంటారు. కానీ లేటుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. సక్సెస్ చూసిన వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. ఇదిగో ఈ కోవలోకి వస్తాడు ఈ ఫోటోలో చిన్నారి.

నందమూరి సినీ వారసత్వానికి పునాది వేసిన సీనియర్ ఎన్టీఆర్ పక్కన కనిపిస్తున్న ఈ పిల్లోడ్ని చూశారా.. అతడో హీరో. ఒక మూవీలో చిన్నక్యారెక్టర్‌లో కనిపించి.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతడు ఎవరో కాదూ.. ఆ యుగపురుషుడి వారసుడే. అతడి పేరు చైతన్య కృష్ణ. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయ కృష్ణ కుమారుడే ఈ చైతన్య. సీనియర్ ఎన్టీఆర్ కు స్వయంగా మనవడు. ఇటీవల బ్రీత్ అనే మూవీ ద్వారా అలరించాడు. మెడికల్ మాఫియా నేపథ్యంలో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 2న విడుదలైంది. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది కానీ.. నటన పరంగా చైతన్యకు మంచి మార్కులే పడ్డాయి. లేటు వయస్సుల్లో హీరోగా ఇండస్ట్రీల్లోకి అడుగుపెట్టిన ఇతగాడు.. గతంలో ఓ చిత్రంలో అలా మెరిశాడు.

2003లో జగపతి బాబు హీరోగా వచ్చిన ‘ధమ్’ మూవీలో ఓ పాత్రలో మెరిశాడు ఈ నందమూరి వారసుడు. సినిమా అవకాశాలు రాలేదో.. లేక వద్దనుకున్నాడో తెలియదు కానీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అలాగే రాజకీయాల వైపు కూడా వెళ్లారు. కానీ మళ్లీ సుమారు 20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది బ్రీత్ అనే మూవీలో పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పాల్లొన్న అతడు.. యాక్టింగ్ మా బ్లడ్ లోనే ఉందంటూ చెప్పడంతో ట్రోల్స్ కు కూడా గురయ్యాడు. అయినా అవేమి పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. మరీ హీరోగా ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలున్నాయని అంటారా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి