iDreamPost

యానిమల్ మూవీలో కనిపించిన ఈ ప్యాలెస్ ఓ స్టార్ హీరోదని మీకు తెలుసా?

యానిమల్ చిత్రంలో హీరో ఉండే ప్యాలెస్ గుర్తుందా? ఈ బంగ్లా ఎవరిదో కాదు.. ఓ స్టార్ హీరోదట. అతనెవరు కాదు..!

యానిమల్ చిత్రంలో హీరో ఉండే ప్యాలెస్ గుర్తుందా? ఈ బంగ్లా ఎవరిదో కాదు.. ఓ స్టార్ హీరోదట. అతనెవరు కాదు..!

యానిమల్ మూవీలో కనిపించిన ఈ ప్యాలెస్ ఓ స్టార్ హీరోదని మీకు తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోయిన్ రష్మిక మందన్నా జంటగా తెరకెక్కిన చిత్రం యానిమల్. ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 1న దేశ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, విడుదలైన నాటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.116 కోట్ల గ్రాస్ చేయగా, రెండవ రోజు మాత్రం 120 కోట్లను రాబట్టింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.236 కోట్లు కొల్లగొట్టింది. ఇక మొత్తానికి విడుదలైన వారం రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ.356 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసి బాలీవుడ్ లో సరికొత్త రికార్డులు నెలకోల్పింది. ఇలాగే కనుక కొనసాగితే మరికొన్ని రోజుల్లోనే ఇంకా భారీ వసూళ్లు వచ్చే అవకాశం లేకపోలేదని సినీ ప్రముఖులు చెబుతున్నారు.

ఈ చిత్రంలో నాన్న సెంట్ మెంట్ తో ఉండడం, యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులు ఈ మూవీని చూసేందుకు థియేటర్ కు పరుగులు పెడుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. యానిమల్ సినిమాలో హీరో ఉండే ప్యాలెస్ గుర్తుందా? ఈ బంగ్లా సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇంతకు ఈ ప్యాలెస్ ఎవరిదనే కదా మీ ప్రశ్న. ఈ అందమైన బంగ్లా ఓ ప్రముఖ హీరోకు చెందిందని తెలుస్తుంది. అవును, మీరు విన్నది నిజమే.

ఈ ప్యాలెస్ బాలీవుడ్ ‘స్టార్ హీరో అయిన సైఫ్ అలీఖాన్ దేనని వార్తలు వినిపిస్తున్నాయి. 10 ఎకరాల్లో ఉన్న ఈ ప్యాలెస్ లో 150 గదులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే, ఈ బంగ్లా విలువ సుమారు రూ.800 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఇదిలా ఉంటే.. ఈ ప్యాలెస్ లో ఇప్పటి వరకు ఎన్నో బాలీవుడ్ సినిమాలు తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ మీరు కూడా యానిమల్ చిత్రంలో కనిపించిన ఆ అందమైన భవంతిని చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాను చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి