iDreamPost

DJ Tillu : స్మార్ట్ స్క్రీన్ పై రాబోతున్న లేటెస్ట్ హిట్

ఓటిటి హక్కులు సొంతం చేసుకున్న ఆహా వచ్చే నెల అంటే మార్చి 4న ప్రీమియర్ కు ప్లాన్ చేసింది. అఫీషియల్ గా ప్రకటించి ట్విట్టర్ లో చెప్పేశారు. ఇప్పటికీ ప్రధాన కేంద్రాల్లో థియేట్రికల్ రన్ లో ఉన్నడిజె టిల్లు భీమ్లా నాయక్ కు ముందే ఫైనల్ రన్ కు వచ్చేసింది.

ఓటిటి హక్కులు సొంతం చేసుకున్న ఆహా వచ్చే నెల అంటే మార్చి 4న ప్రీమియర్ కు ప్లాన్ చేసింది. అఫీషియల్ గా ప్రకటించి ట్విట్టర్ లో చెప్పేశారు. ఇప్పటికీ ప్రధాన కేంద్రాల్లో థియేట్రికల్ రన్ లో ఉన్నడిజె టిల్లు భీమ్లా నాయక్ కు ముందే ఫైనల్ రన్ కు వచ్చేసింది.

DJ Tillu : స్మార్ట్ స్క్రీన్ పై రాబోతున్న లేటెస్ట్ హిట్

ఈ నెల 12న విడుదలై రవితేజ ఖిలాడీని ఓవర్ టేక్ చేసి మరీ విజయం సాధించిన చిన్న సినిమా డీజే టిల్లు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఓటిటి హక్కులు సొంతం చేసుకున్న ఆహా వచ్చే నెల అంటే మార్చి 4న ప్రీమియర్ కు ప్లాన్ చేసింది. అఫీషియల్ గా ప్రకటించి ట్విట్టర్ లో చెప్పేశారు. ఇప్పటికీ ప్రధాన కేంద్రాల్లో థియేట్రికల్ రన్ లో ఉన్నడిజె టిల్లు భీమ్లా నాయక్ కు ముందే ఫైనల్ రన్ కు వచ్చేసింది. మార్చి 4 నుంచి కొత్త సినిమాల సందడి మొదలు కానుండటంతో ఇంతకన్నా కలెక్షన్ల పరంగా ఆశించడం అత్యాశే అవుతుంది. బిసి సెంటర్స్ లో టిల్లు ఆల్రెడీ మంచి లాభాలతో సెలవు తీసుకున్నాడు.

ట్రేడ్ చెబుతున్న ప్రకారం సుమారు 9 కోట్ల 40 లక్షల బిజినెస్ జరుపుకున్న డిజె టిల్లు ఫైనల్ గా 16 కోట్ల దాకా వసూలు చేయడం రికార్డు. అంటే ఆరున్నర కోట్ల దాకా లాభమన్న మాట. ఈ మధ్య కాలంలో ఇంత ప్రాఫిట్ ఇచ్చిన చిన్న సినిమా ఇదే. నిర్మాత కోణంలో చూసుకుంటే ఇక్కడ చెప్పిన మొత్తంలో డిజిటల్, డబ్బింగ్, శాటిలైట్, రీమేక్ హక్కులు ఇవేవి కలపలేదు. అవీ యాడ్ చేస్తే లెక్క ముప్పై కోట్లకు దగ్గరగా వెళ్లినా ఆశ్చర్యం లేదు. దెబ్బకు సిద్దు జొన్నలగడ్డ మార్కెట్ పెరిగిపోయింది. కొత్త సినిమాలకు మూడు కోట్లకు పైగా రెమ్యునరేషన్ అడుగుతున్నట్టు ఫిలిం నగర్ టాక్. సక్సెస్ వచ్చినప్పుడు ఎవరైనా చేసేది ఇదే.

గత రెండు మూడు వారాలుగా కంటెంట్ విషయంలో కొంత వెనుక బడిన ఆహాకు డీజే టిల్లు మంచి బూస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. బాలకృష్ణ ఆన్ స్టాపబుల్ తర్వాత సినిమాలు వెబ్ సిరీస్ లు కానీ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి రాలేదు. ప్రతి శుక్రవారం కొత్త సినిమా అన్నారు కానీ దానికి కట్టుబడిన దాఖలాలు తగ్గుతున్నాయి. అందుకే ఇప్పుడో క్రేజీ ప్రీమియర్ అవసరం. భీమ్లా నాయక్ హక్కులు కూడా ఆహా సొంతం చేసుకుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సబ్స్క్రైబర్స్ పెరిగే అంచనాలో ఉంది ఆహా. మొత్తానికి చిన్న సినిమాల్లో పెద్ద విజయంసాధించిన  డీజే టిల్లు స్మార్ట్ స్క్రీన్ మీద ఎలాంటి స్పందన దక్కించుకుంటుందో చూడాలి

Also Read : Rana Daggubati :ఈ విజయాన్ని వాడుకోమంటున్న అభిమానులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి