iDreamPost

గణేశుని నిమజ్జనంలో అపశృతి.. ముగ్గురు యువకులు మృతి

గణేశుని నిమజ్జనంలో అపశృతి.. ముగ్గురు యువకులు మృతి

వినాయక చవితి రోజు ఆనందంగా పండుగ చేసుకున్న ముగ్గురు యువకులు.. నిమజ్జనం రోజున మృత్యు ఒడికి చేరుకున్నారు. మూడు కుటుంబాలను విషాదంలోకి నెట్టేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ముగ్గురు యువకులు పొట్టకూటి కోసం ఇక్కడకు వచ్చిన వారే. వివర్లాలోకి వెళితే.. గణపవరంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో బేల్ దారీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు మహారాష్ట్రకు చెందిన ముఖేష్ మోతిరామ్ ఖోటే. వినాయక చవితి సందర్భంగా ముఖేష్ ఇంట్లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహానికి నిమజ్జనం చేసేందుకు ముఖేష్ తో పాటు వెళ్లారు అదే స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న కుటుంబాలకు చెందిన ప్రవీణ్, వసంత్ కుమార్లు.

ప్రవీణ్.. ప్రకాశం జిల్లా మార్కాపురం గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, వసంత్.. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం బొమ్మిడివాని పేటకు వ్యక్తి. వీరి తల్లిదండ్రులు స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ.. కంపెనీ క్వార్టర్లతో నివాసం ఉంటున్నారు. కాగా, ప్రవీణ్, వసంత్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. వినాయక చవితి రోజు ముఖేష్ తన ఇంట్లో వినాయక విగ్రహం ఏర్పాటు చేయగా.. నిమజ్జనం చేయడానికి  ప్రవీణ్, వసంత్ లు ప్రభువు చెరువు వద్దకు వెళ్లారు. ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చెరువు వద్దకు వెళ్లి చూశారు. అక్కడ వారి చెప్పులు, బైక్, సైకిల్ కనిపించగా.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానకి చేరుకున్న పోలీసులు చెరువులో గాలించగా.. రాత్రి 11 గంటల సమయంలో ప్రవీణ్ మృతదేహం లభించింది.

మరుసటి రోజు వెతకగా.. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా, వీరిలో ముఖేష్ తల్లి ఇటీవల చనిపోయింది. దీంతో అతడు వినాయక విగ్రహానికి పూజలు చేయడం ఆపేశాడు. గతంలో భార్య వదిలేసి వెళ్లిపోయింది. ముగ్గురు పిల్లలుండగా.. రెండేళ్ల కూతురు ఉంది. ఆ పాపను అపురూపంగా చూస్తున్నాడు. తల్లి మరణించిన నేపథ్యంలో విగ్రహానికి పూజలు చేయకూడదని భావించి..ఆ విగ్రహం ఇంట్లో ఉండకూడదని నిమజ్జనం చేయాలని కోరగా.. ప్రవీణ్, వసంత్ లు అతడి వెంట వెళ్లారు. చెరువులో దిగిన ఈ ముగ్గురు మృత్యువాత పడ్డారు. ముఖేష్ తో పాటు వీరిద్దరూ చనిపోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి