iDreamPost

Manasvi: 600కి 599 మార్కులు సాధించిన విద్యార్థిని ఖాతాలో మరో రికార్డు!

  • Published Apr 23, 2024 | 11:31 AMUpdated Apr 23, 2024 | 11:31 AM

AP SSC Results 2024: పదో తరగతి ఫలితాల్లో 599 మార్కులు సాధించి.. రికార్డు క్రియేట్‌ చేసిన మనస్వి.. ఖాతాలో మరో రికార్డు చేరింది. ఆ వివరాలు

AP SSC Results 2024: పదో తరగతి ఫలితాల్లో 599 మార్కులు సాధించి.. రికార్డు క్రియేట్‌ చేసిన మనస్వి.. ఖాతాలో మరో రికార్డు చేరింది. ఆ వివరాలు

  • Published Apr 23, 2024 | 11:31 AMUpdated Apr 23, 2024 | 11:31 AM
Manasvi: 600కి 599 మార్కులు సాధించిన విద్యార్థిని ఖాతాలో మరో రికార్డు!

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి 2024 ఫలితాలు సోమవారం నాడు విడుదలయ్యాయి. ఇక ఏలూరు జిల్లా, నూజివీడు పట్టణానికి చెందిన ఆకుల వెంకటసాయి మనస్వి ఏకంగా 600 మార్కులకు గాను.. 599 మార్కులు సాధించి స్టేట్‌ టాపర్‌గా నిలిచింది. ఆమెకు ఒక్క సెకండ్ లాంగ్వేజీలో తప్ప.. మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో 100కు 100 మార్కులు వచ్చాయి. 599 మార్కులతో సాయి మనస్వి ఏపీ పదో తరగతి ఫలితాల్లో టాపర్‌గా నిలిచిందని ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. ఇక మనస్వి రికార్డు బ్రేక్‌ చేయడం ఇప్పట్లో సాధ్యం కాదు అంటున్నారు. అలా బ్రేక్‌ చేయాలంటే.. 600కి 600 మార్కులు సాధించాలి. కానీ అది అసాధ్యం అంటున్నారు. ఇక 599 మార్కులు సాధించి స్టేట్‌ టాపర్‌గా నిలవడంతో… నిన్నటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో మనస్విని పేరు మార్మొగిపోతుంది. ఇలా ఉండగా.. తాజాగా మనస్విని మరో రికార్డు క్రియేట్‌ చేసింది.

పదో తరగతి ఫలితాల్లో 599 మార్కులు సాధించి స్టేట్‌ టాపర్‌గా నిలిచిన మనస్వి ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. రాష్ట్ర చరిత్రలోనే ఆమె అరుదైన రికార్డు క్రియేట్‌ చేసింది అంటున్నారు. అది ఏంటంటే.. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిగా మనస్వి సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో స్టేట్‌ టాపర్స్‌గా నిలిచిన వారికి వచ్చిన మార్కులు.. మనస్వి కన్నా తక్కువ. గతంలో అనగా 2022లో స్టేట్‌ టాప్‌ మార్క్‌ 598 కాగా.. 2023లో ఇది ఒక మార్క్‌ తగ్గి 597కి చరింది. ఇక తాజాగా ఫలితాల్లో 600కి ఏకంగా 599 మార్కులు సాధించి.. మనస్వి గత రికార్డులను బద్దలు కొట్టింది. పైగా ఇప్పట్లో ఆమె రికార్డును బ్రేక్‌ చేయడం ఎవరికి సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు.

ఇక మనస్వి కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. వారి ప్రోత్సాహంతోనే మనస్వి ఈ రికార్డు క్రియేట్‌ చేసింది. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలి అనుకుంది. కానీ ఏకంగా టాపర్‌గా నిలిచింది. ఇక ఎప్పటి సిలిబస్‌ను అప్పుడు పూర్తి చేయడం మనస్వికి అలవాటంట. అందుకోసం తెల్లవారుజామున 4 గంటల​కే నిద్ర లేచి చదువుకునేది అనేది ఆమె తల్లిదండ్రులు తెలుపుతున్నారు. ఇక మనస్వికి క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. విరాట్‌ కోహ్లి ఆమె అభిమాన ఆటగాడు. మ్యాథ్స్‌ అంటే ఇష్టమంటున్న మనస్వి.. ఐఐటీలో ఇంజినీరింగ్‌ చేసి మంచి జాబ్‌ తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆమెకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి