iDreamPost
android-app
ios-app

CM Jagan: పల్నాడు బస్సు ప్రమాద ఘటనపై స్పందించిన సీఎం జగన్‌

  • Published May 15, 2024 | 1:04 PMUpdated May 15, 2024 | 6:07 PM

పల్నాడు వద్ద బస్సులో మంటలు చెలరేగి.. ఆరుగురు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం జగన్‌ స్పందించారు. ఆ వివారలు..

పల్నాడు వద్ద బస్సులో మంటలు చెలరేగి.. ఆరుగురు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం జగన్‌ స్పందించారు. ఆ వివారలు..

  • Published May 15, 2024 | 1:04 PMUpdated May 15, 2024 | 6:07 PM
CM Jagan: పల్నాడు బస్సు ప్రమాద ఘటనపై స్పందించిన సీఎం జగన్‌

పల్నాడు బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఓటేయడం కోసం సొంత ఊళ్లకు వచ్చిన జనాలు.. తిరిగి హైదరాబాద్‌కు పయనం అయ్యారు. అయితే ఈ సమయంలో చోటు చేసుకున్న యాక్సిడెంట్‌ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం కాగా.. 20 మంది గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఓటు వేయడానికి వచ్చిన వారు.. ఇలా అనంత లోకాలకు వెళ్తారని ఊహించలేదు అంటూ బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. ఆ వివరాలు..

పల్నాడులో చోటు చేసుకున్న బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జనగ్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాల​కు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సహాయక చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని అధికారులును ఆదేశించారు.

ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్‌ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం-పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా దూసుకువచ్చిన కంకర టిప్పర్‌.. బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌లో మంటలు చెలరేగి.. ఆ తర్వాత వేగంగా అవి బస్సుకు వ్యాపించాయి. దాంతో బస్సులో ఉన్న వారిలో ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉండే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. ఓటేయడానికి వచ్చి.. అనంతలోకాలకు వెళ్లారు.. రాత్రి వరకు ఎంతో సంతోషంగా గడిపిన వారి జీవితాలు ఇలా తెల్లారకముందే.. తెల్లవారుతాయని అనుకోలేదు.. ఓటేయకున్నా బాగుండేది అని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి