iDreamPost

దిశ చట్టం – జగన్ కి లేఖ రాసిన కేజ్రీవాల్

దిశ చట్టం – జగన్ కి లేఖ రాసిన కేజ్రీవాల్

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణమైన ఘటనలను నివారించటానికి కఠినమైన చట్టాలు అవసరమని భావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దిశ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై కేసు నమోదైన తరువాత కంక్లుజివ్ ఎవిడెన్స్ ( బలమైన సాక్ష్యాలు) ఉంటే 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్ష పడేలా ఈ బిల్లు రూపోందించారు. అలాగే సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులకు దిగితే మొదటిసారి 2 సంవత్సరాలు, రెండవసారి 4 ఏళ్ళ జైలు శిక్ష అని బిల్లులో పొందుపరిచారు. రోజు రోజుకు అన్ని రంగాలలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి ఆలోచించి వారి భద్రతకై కఠిన చట్టాలను తీసుకువచ్చిన ముఖ్యమంత్రి జగన్ పై దేశం నలు మూలలనుండి అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి.

దిశ ఘటనకు నిరసనగా నిరాహార దీక్షకు దిగిన డిల్లీ మహిళా కమీషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీసుకువచ్చిన దిశ చట్టాన్ని ప్రశంశిస్తు ఇదే చట్టం దేశవ్యాప్తంగా అమలు చెయ్యాలని ప్రధాని మోడికి లేఖ రాశారు. పార్లమెంట్ మెంబర్ అయిన సోనాల్ మాన్సింగ్, ముఖ్యమంత్రి జగన్ తెచ్చిన ఈ చట్టం అన్ని రాష్ట్రాలో అమలవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పద్మశ్రీ పురస్కార గ్రహిత , ప్రజ్వలా ఫౌండర్ సునీత కృష్ణన్ ఈ బిల్లు తెచ్చి ముఖ్యమంతి జగన్ దేశానికే ఆదర్శం గా నిలిచారని కొనియాడారు. ఇప్పుడు తాజాగా డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ మహిళా భద్రతకై దిశ చట్టాన్ని తెచ్చిన జగన్ ని ప్రశంశిస్తు ఆ బిల్లు పత్రాలని తమకి ఒకసారి పంపించమని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం చదివి వినిపించారు. దేశ ప్రజల మన్ననలు పొందిన ఈ దిశ బిల్ల్ ఒక చారిత్రాత్మిక బిల్ గా అభివర్ణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి