iDreamPost

కేంద్రం గుడ్ న్యూస్.. సొంతింటి కోసం వడ్డీ లేని రుణాలు.. త్వరపడండి

మీరు ఇల్లు లేదని బాధపడుతున్నారా? సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే కేంద్రం మీకు ఒక గుడ్ న్యూస్ అందించింది. సొంతింటి నిర్మాణం కోసం వడ్డీ లేని రుణాలను అందిస్తోంది.

మీరు ఇల్లు లేదని బాధపడుతున్నారా? సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే కేంద్రం మీకు ఒక గుడ్ న్యూస్ అందించింది. సొంతింటి నిర్మాణం కోసం వడ్డీ లేని రుణాలను అందిస్తోంది.

కేంద్రం గుడ్ న్యూస్.. సొంతింటి కోసం వడ్డీ లేని రుణాలు.. త్వరపడండి

చిన్నదో.. పెద్దదో.. మొత్తానికి ఓ ఇల్లు ఉండాలని అంతా భావిస్తుంటారు. సొంతిల్లు కోసం అహర్నిషలు కష్టపడుతుంటారు. పైసా పైసా కూడబెట్టి తమ కలల ఇంటిని నిర్మించుకోవాలని ఎదురుచూస్తుంటారు. కానీ నేటి రోజుల్లో ఖర్చులు అధికమవ్వడం, ఆదాయ మార్గాలు అంతంతమాత్రంగానే ఉండడంతో చాలా మందికి సొంతింటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు. అద్దె ఇళ్లలో ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎంతైనా సొంతిల్లుంటే ఆ భరోసానే వేరు కదా. అయితే ఇప్పటికీ ఇల్లు లేని పేదల కోసం కేంద్రం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్. ఈ పథకం ద్వారా ఇంటి నిర్మాణం కోసం వడ్డీలేని రుణాలను అందిస్తోంది.

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు కూడా ఖర్చుతో కూడుకున్నవి. ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం అంటే గగనమైపోయింది. స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి పెరుగుతున్న ధరలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఇల్లు కట్టుకోవడం కోసం కూడబెట్టిన సొమ్ము సరిపోకపోతే బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి సిద్ధమవుతుంటారు. అయితే బ్యాంకులు గానీ, ఆర్థిక సంస్థలు గానీ ఇచ్చే లోన్లపై అధిక వడ్డీలను వసూల్ చేస్తుంటాయి. ఇది మరింత ఆర్థిక భారాన్ని పెంచుతుంది. ఈ కష్టాల నుంచి రక్షించేందుకు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా సొంతిల్లు నిర్మించుకునే వారికి వడ్డీలేని రుణాలను అందిస్తోంది.

Interest free loans for house construction 2

ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కేంద్రం అరకోటి కాంక్రీట్ ఇల్లను నిర్మించినట్లుగా సమాచారం. మరింత ఎక్కువ మందికి లబ్థి చేకూరేలా 2024 –25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ పథకానికి నిధులు పెంచారు. దాదాపు 15 శాతం నిధులు పెంచింది కేంద్రం. వడ్డీ లేని రుణాలను అందించి 2025 నాటికి కోటి ఇళ్లను నిర్మించి పేద ప్రజలకు అందించాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంకుల ద్వారా ఈ వడ్డీలేని రుణాలను పొందొచ్చు. అంతేకాకుండా ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఇళ్ల నిర్మాణాల కోసం హౌసింగ్ స్కీమ్ తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి