iDreamPost

ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ఆ ఇద్దరు మహిళలు..?

దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఓ కుంభకోణం కేసులో పలు పార్టీలకు చెందిన కీలక నేతలు అరెస్టు అయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో పరిస్థితులు

దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఓ కుంభకోణం కేసులో పలు పార్టీలకు చెందిన కీలక నేతలు అరెస్టు అయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో పరిస్థితులు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ఆ ఇద్దరు మహిళలు..?

త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఎన్నికల నగారా మోగడానికి ముందే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టు చేశారు ఎన్ ఫోర్స్‌మెంట్ అధికారులు. దేశంలో వెలుగు చూసిన ఈ కుంభకోణంలో తెలుగు గల్లీ నుండి ఢిల్లీ గడ్డ వరకు రాజకీయాల్లో కీలక మార్పులు సంతరించుకున్నాయి. కవిత అరెస్టు చేసిన వారం రోజుల్లోపే ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అఫీషియల్స్. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముంగిట ఇద్దరు కీలక నేతల్ని అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది.

ఇప్పటి వరకు ఈ కేసులో 16 మందిని అరెస్టు చేయగా.. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ అట్టుడుకుతోంది. ఈ అరెస్టు అక్రమమంటూ ఆప్ శ్రేణులు ఆందోళన చేపడుతున్నాయి. దీంతో పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. కేజ్రీవాల్ ఇంటి పరిసరాల్లో మూడెంచల భద్రత ఏర్పాటు చేశారు. దేశంలో ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే అరెస్టైన తొలి సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ నిలిచిపోయారు. ఇప్పడు ఆయన అరెస్టుతో ఆప్ పార్టీ పరిస్థితి ఏంటన్న ఆందోళన నెలకొంది. ఆయన కూడా హేమంత్ సోరెన్ తరహాలో ముఖ్యమంత్రి బాధ్యతలు మరొకరికి అప్పగిస్తారా..? లేక జైలులో ఉండి పరిపాలిస్తారా అని తెలియాల్సి ఉంది.

Delhi Next CM

ఒక వేళ ఆయన జైలుకు వెళ్లాల్సి వస్తే పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారన్న ఆందోళన నెలకొంది. కాగా, ఆప్ పార్టీలో కీలక నేతలంతా ఇదే కేసులో జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ జైలులో ఉన్నారు. ఇక మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ మాత్రమే కీలకమైన నేతలు. ఇప్పుడు వీరిలో అతిషి అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఆమె మాత్రం.. కేజ్రీవాల్ జైలు నుండి పరిపాలిస్తారంటూ మీడియా ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కూడా అధికారం చేపట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. చూడాలి.. ఆయనే పరిపాలిస్తారా..? మరెవ్వరికైనా బాధ్యతలు అప్పగిస్తారా అనేది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి