iDreamPost
android-app
ios-app

Salaar-Rajamouli: భారీ ధరకు సలార్ ఫస్ట్ టికెట్ కొన్న రాజమౌళి.. ధర ఎంతో తెలుసా?

  • Published Dec 16, 2023 | 10:26 AM Updated Updated Dec 16, 2023 | 10:28 AM

సలార్ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ సినిమా తొలి టికెట్ ను దర్శకధీరుడు రాజమౌళి భారీ ధరకు దక్కించుకున్నారు. మరి తొలి టికెట్ ను ఎంతకు కొన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

సలార్ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ సినిమా తొలి టికెట్ ను దర్శకధీరుడు రాజమౌళి భారీ ధరకు దక్కించుకున్నారు. మరి తొలి టికెట్ ను ఎంతకు కొన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Dec 16, 2023 | 10:26 AMUpdated Dec 16, 2023 | 10:28 AM
Salaar-Rajamouli: భారీ ధరకు సలార్ ఫస్ట్ టికెట్ కొన్న రాజమౌళి.. ధర ఎంతో తెలుసా?

‘సలార్’.. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ మెుత్తం ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా. ఇక వారి అంచనాలకు తగ్గట్లుగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తేనే తెలిసిపోయింది. అదీకాక ఇటీవల విడుదలైన ‘సూరీడే’ పాట ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే సలార్ కు సంబంధించి ప్రమోషన్స్ గానీ, ఒక్క ప్రెస్ మీట్ గానీ, ఈవెంట్ గానీ టీమ్ పెట్టలేదు. ఇది డార్లింగ్ ఫ్యాన్స్ కు ఒక్కింత నిరాశకలిగించే విషయమే. కాగా.. ఒకే ఒక్క ఇంటర్వ్యూ మాత్రం మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారని, త్వరలోనే అది రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఇక ఈ ఇంటర్వ్యూలోనే సలార్ తొలి టికెట్ ను రాజమౌళి భారీ ధరకు కొన్నారని తెలుస్తోంది.

డిసెంబర్ 22న పెద్ద సినిమా పండగ జరగబోతోంది. ఇందుకోసం యావత్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజున సలార్ థియేటర్లలోకి ఆగమనం చేస్తున్నాడు. అయితే రిలీజ్ కు ఇంకా కొన్ని రోజులే టైమ్ ఉండటం, ఇప్పటి వరకు ఒక్క ప్రమోషన్ ఈవెంట్ కూడా సలార్ టీమ్ ప్లాన్ చేయకపోవడంతో.. అభిమానులు తీవ్ర నిరాశలో చెందుతున్నారు. ఇక వారిని ఆశ్చర్యపరిచేందుకు ఓ ఇంటర్వ్యూలో అగ్ర దర్శకులు రాజమౌళి, ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ లతో కలిపి కనిపించనున్నారట. త్వరలోనే ఈ ఇంటర్వ్యూను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

ఇందులో భాగంగా సలార్ తొలి టికెట్ ను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కొన్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ధృవీకరించారు. అందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ప్రముఖ థియేటర్ సంధ్య 70MM థియేటర్ లో భారీ ధరకు ఫస్ట్ టికెట్ ను బుక్ చేసుకున్నారు జక్కన్న. ఇంతకీ ఈ అగ్ర దర్శకుడు  ఫస్ట్ టికెట్ ఎంతకు కొన్నాడో తెలుసా? అక్షరాలా 10,116 రూపాయలకు జక్కన్న ఈ టికెట్ ను కొన్నట్లు సమాచారం. కాగా.. నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నారు. రాజమౌళి ఫస్ట్ టికెట్ ను ఇంత ధరకు కొనడంతో.. ఈ మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇదిలా ఉండగా.. సలార్ ప్రమోషన్స్ లేకపోయినా పర్వాలేదని, కనీసం ఈ ఇంటర్వ్యూ అయినా త్వరగా టెలికాస్ట్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. మరి ఇంత భారీ ధరకు జక్కన్న సలార్ తొలి టికెట్ కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş