iDreamPost
android-app
ios-app

Dinesh Karthik’s Wife : దినేశ్‌ కార్తిక్‌ భార్య ఎమోషనల్ పోస్ట్.. నేనైతే వదిలేసేదాన్నేమో అంటూ!

  • Published May 24, 2024 | 6:15 PM Updated Updated May 24, 2024 | 6:15 PM

టీమ్ ఇండియా సీనియర్ క్రికెట్ ప్లేయర్ దినేష్ కార్తీక్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా దినేష్ ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దినేష్ భార్య దీపికా అతని గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

టీమ్ ఇండియా సీనియర్ క్రికెట్ ప్లేయర్ దినేష్ కార్తీక్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా దినేష్ ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దినేష్ భార్య దీపికా అతని గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

  • Published May 24, 2024 | 6:15 PMUpdated May 24, 2024 | 6:15 PM
Dinesh Karthik’s Wife : దినేశ్‌ కార్తిక్‌ భార్య ఎమోషనల్ పోస్ట్.. నేనైతే వదిలేసేదాన్నేమో అంటూ!

ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు.. దాదాపు పదిహేడేళ్ల సుధీర్గ ప్రయాణాన్ని కొనసాగించిన.. టీమ్ ఇండియా సీనియర్ క్రికెట్ ప్లేయర్ దినేష్ కార్తీక్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ఐపీఎల్ 2024 లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జట్టు ఓడిపోయి.. ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అనంతరం క్రికెటర్లలో ఒకడైన దినేష్ కార్తీక్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీనితో అతని చివరి మ్యాచ్ తర్వాత.. అతని టీమ్ అంతా కార్తీక్ కు ఘనంగా వీడ్కోలు పలికింది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో దినేష్ భార్య దీపికా అతని గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది.

దినేష్ కార్తీక్ భార్య దీపికా పళ్లికల్ అతని గురించి మాట్లాడుతూ.. “జీవితంలో ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది. మేము 2013లో తొలిసారి ఒకరినొకరం నేరుగా కలిశాం. ఇద్దరి మనసులలోను కలిసి జీవించాలనే ఆలోచనే వచ్చింది. ఆ తర్వాత అన్నీ సజావుగా సాగిపోయాయి. తనలో నాకు నచ్చిన గుణం ఏంటంటే.. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగడం. బాగా ఆడలేక కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పుడు.. రెండు మూడు రోజుల పాటు కాస్త నిరాశగా కనిపిస్తాడు. తిరిగి వెంటనే కోలుకుని తర్వాత ఏం చేయాలా అని దానిపై దృష్టిపెడతాడు. నాకు తెలిసి అలాంటి స్థితిలో వేరే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కృంగిపోతారు. నేను కూడా ఓ అథ్లెట్ ను కాబట్టి అతని మానసిక స్థితిని అంచనా వేయగలను.. తన స్థానంలో నేనే కనుక ఉంటే.. ఇక చాల్లే అని వదిలేసేదాన్నేమో.

కానీ, తను అలా కాదు. తన కెరీర్ లో అనేక దశల్లో వివిధ రకాల పాత్రలు పోషించాల్సి వచ్చింది. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా తానూ పట్టుదలగా నిలబడ్డాడు. ప్రతి సారి గతం కంటే మెరుగ్గా ఆడుతూ ముందుకు సాగాడు. డీకే తన జీవితంలో ఏమైతే సాధించాలి అనుకున్నాడో అన్నీ సాధించాడు. అలాంటి వ్యక్తి ఇకపై ఆటకు దూరంగా ఉండాలంటే అది అంత సులువైన విషయం కాదు. అయితే, వ్యక్తిగతంగా తన జీవితంలో ముందుకు సాగాలని దినేష్ నిరణయించుకున్నాడు. తన కోసం తన కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. తను సాధించిన విజయాలు మమ్మల్ని గర్వపడేలా చేశాయి.” అంటూ దీపికా పళ్లికల్ భావోద్వేగంతో ఈ విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా వైరల్ అవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişEnbet Girişivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş